
ఆగామోత్కూర్ పాలేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మాడుగులపల్లి:- బడ్జెట్ సరిపోలేదనే సాకుతో బ్రిడ్జి నిర్మాణాన్ని నిలిపివేశారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాడుగులపల్లి మండలం పంచాయతీరాజ్ ఏఈ మధును కోరారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం పరిధిలోని ఆగామోత్కూర్ పాలేరు వాగు పై నిర్మాణంలో ఉన్న నూతన బ్రిడ్జి నీ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి స్థానిక సిపిఎం నాయకులతో, రైతులతో కలిసి సోమవారం బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆగామోత్కూర్ పాలేరు వాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని బడ్జెట్ సరిపోలేదనే కారణంతో అర్థాంతరంగా నిలిపివేయడం జరిగింది. బడ్జెట్ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్,మండల నాయకులు దేవిరెడ్డి అశోక్ రెడ్డి, పుల్లెంల శ్రీకర్,చారి,పతాని శ్రీను, శాఖ కార్యదర్శి బంటు రాజు, మరియు పార్టీ సభ్యులు,రైతులు పాల్గొన్నారు.
Read also : గెలిచి 10 గంటలు అవుతుంది… ఇప్పటివరకు నో విషెస్?
Read also : సుధీర్ ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా?