
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. మత్తులో ఉన్న నలుగురు యువకులు అల్ట్రాటెక్ కంపెనీలో పనిచేసే ఓ కార్మికుడిపై ఒక్కసారిగా దాడికి దిగారు. నిందితులు బాధితుడిని రాళ్లతో కొట్టడమే కాకుండా, చాకుతో కూడా విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాయపడిన కార్మికుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడిన యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాలతో నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
Read also : మారిన మందుల చీటీ.. రోగి ప్రాణాలను తీసింది!
Read also : హంతకులతో వేదిక పంచుకోలేను.. కాంగ్రెస్ మీటింగ్ నుంచి అలిగి వెళ్లిపోయిన జీవన్ రెడ్డి.. తీవ్ర ఉద్రిక్తత!





