తెలంగాణ

కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి… కేంద్రానికి రేవంత్‌ సర్కార్‌ లేఖ

  • ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా దర్యాప్తు జరపాలి

  • కేంద్ర హోంశాఖ ఆమోదిస్తే మొదలుకానున్న సీబీఐ విచారణ

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం ఢిల్లీకి చేరింది. కాళేశ్వరంలో జరిగిన అవతవకలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్‌ లేఖ రాసింది. కాళేశ్వరంపై రేవంత్‌ ప్రభుత్వం నియమించిన ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కేంద్ర హోంశాఖకు అధికారికంగా లేఖను పంపారు. రేవంత్‌ సర్కార్‌ విజ్క్షప్తిని కేంద్ర హోంశాఖ ఆమోదిస్తే సీబీఐ దర్యాప్తు మొదలయ్యే అవకాశం ఉంది.

బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన

కాళేశ్వరంలో అవకతవకలపై వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తును కోరడం, విచారణ కోరుతూ ఇప్పుడు ఏకంగా కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కలవరం స్టార్టయింది. మేడిగడ్డ దగ్గర పిల్లర్ల కుంగుబాటు, బ్యారేజీ పనులకు చెల్లించిన బిల్లులపై లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో నీటిపారుదల శాఖ పాత్రపైనా విచారించాలని ఘోష్‌ కమిషన్‌ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపడితే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అంతానేనే అని పలుమార్లు కేసీఆర్‌ చెప్పిన విషయం తెలిసిందే. సీబీఐ దర్యాప్తులో అవకతవకలు నిజమేనని తేలితే కేసీఆర్‌, హరీశ్‌సహా మరికొందరి భవితవ్యం ఏమిటనే చర్చ సర్వత్రా నడుస్తోంది.

Read Also: 

కన్నడ వచ్చా? అన్న సిద్ధరామయ్య, ఆసక్తిర సమాధానం చెప్పిన రాష్ట్రపతి!

Back to top button