
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ప్రస్తుత రోజుల్లో చాలామంది వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. దీనివల్ల చాలామంది తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. సాధారణంగా వివాహం అనేది ఒక పవిత్ర బంధం. ఇది ఇరువురి పై ఉన్న నమ్మకం, ఇద్దరి భావోద్వేగాలు, ఇద్దరికీ ఉండే గౌరవం మీద జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ జీవితంలోకి మూడో వ్యక్తి ప్రవేశించినప్పుడే ఇద్దరి బంధం తెగిపోతూ ఉంటుంది. దానికి పేరే ఈ వివాహేతర సంబంధం. ఈ వివాహేతర సంబంధం పై తాజాగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
Read also : వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : సుమన్ కళ్యాణ్
తాజాగా ఒక మహిళ నాకు 2012లో పెళ్లి అయింది. 2021 వ సంవత్సరంలో నా భర్త వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల మా జీవితం పూర్తిగా దెబ్బతిన్నదని కోర్టులో కేసు వేసింది. అంతేకాకుండా వేరే మహిళతో ట్రిక్స్ కి వెళ్లడం, తరచూ కలవడం, చివరికి విడాకులు కోరుకునే వరకు వచ్చిందని చెప్పుకొచ్చింది. దీంతో ఒకవైపు మానసికంగా మరోవైపు బాగోద్వేగపరంగా తీవ్రంగా నష్టపోయానంటూ ఆ పిటీషన్లో పేర్కొంది. అయితే ఈ కేసు పై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివాహేతర సంబంధం క్రిమినల్ నేరం కాదని.. దానివల్ల నష్టపోయిన జీవిత భాగస్వామి సివిల్ కోర్టులో కేసు వేసి నష్టపరిహారం కోరుకునే హక్కు ఉందని తెలిపింది. మన భారతీయ చట్టంలో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అయినా కూడా భవిష్యత్తులో ఇలాంటి కేసులకు ఇది ఒక న్యాయపరమైన మార్గదర్శకం అవుతుంది.
Read also : రేపు అన్ని థియేటర్లలో OG నే.. రేపు మిరాయ్ సినిమాకు హాలిడే?