ఆంధ్ర ప్రదేశ్
Trending

జగన్ పై మండిపడ్డ పెమ్మసాని… ఈ సారి ఆ 11 సీట్లు కూడా రావు?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో వైయస్ జగన్ కు మొన్న వచ్చిన 11 సీట్లు కూడా రావని … ఈసారి కేవలం ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అవుతారని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి భాష, అతని వ్యవహారంతో వైసీపీకి కచ్చితంగా కష్టాలు తప్పవని అన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలతో చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేయించారని అన్నారు. వాటి పైనే ఇప్పుడు వారందరిపై కేసులు పెడుతున్నారని తెలిపారు. కాబట్టి తప్పు చేసిన వారిని కచ్చితంగా శిక్షించాలి కాబట్టి ఇందులో ఎటువంటి తప్పు లేదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు కొన్ని కోట్ల అప్పు ఉన్న… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ఆదుకుంటున్నారని అన్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. కాగా 2024 ఎలక్షన్లలో వైయస్సార్సీపి పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హక్కును కూడా కోల్పోయాడు.

ఇవి కూడా చదవండి

1.రేఖా గుప్తా అనే నేను…. ఢిల్లీలో ఎగురుతున్న బిజెపి జండా!..

2.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి పొంగిలేటి సెటైర్లు!..

3. కేసీఆర్ పై కేసు పెట్టిన వ్యక్తి దారుణ హత్య

Back to top button