
చౌటుప్పల్, (క్రైమ్ మిర్రర్): రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందిన ఘటన చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వలిగొండ క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు కొయ్యడ నందిని (40), వలిగొండ మండలం, గొల్లపల్లి గ్రామానికి చెందిన తమ కుమార్తె ఇంటికి భార్యాభర్తలు వెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ కు బయలుదేరారు.
!చౌటుప్పల్ టౌన్ వలిగొండ క్రాస్ రోడ్ వద్ద భార్యాభర్తలు బైక్ పై రోడ్డు క్రాస్ చేస్తుండగా అదే సమయంలో విజయవాడ నుండి హైదరాబాద్ వైపు అతివేగంతో వచ్చిన ఓ లారీ, వారి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నందిని కిందపడటంతో ఆమె తలపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు చౌటుప్పల్ మండలం, కొయ్యలగూడెం గ్రామానికి చెందిన మహిళగా గుర్తించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథ కుమార్ తెలిపారు.