
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నిన్నటి నుంచి రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అధికారులు అన్నట్టుగానే నిన్నటి నుంచే కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. నేడు కూడా కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA అధికారులు వెల్లడించారు.
1. ప్రకాశం
2.నెల్లూరు
3.చిత్తూరు
4. కడప
5. తిరుపతి
ఈ మూడు జిల్లాలలో నేడు అల్పపీడనం ప్రభావం కారణంగా ఉరుములతో కూడినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయిని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాలలో పలు పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఇక మిగతా జిల్లాలు అయినటువంటి తిరుపతి, కడప అలాగే ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో… ఈ జిల్లాల విద్యార్థులకు కూడా సెలవులు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కురిసిన వర్షాలు ఒకింత మేలు చేసినా కూడా మరోవైపు వ్యవసాయానికి నష్టం కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వాహనదారులు కూడా అత్యవసర ప్రయాణాలు అయితేనే చేయాలని… లేదంటే ఇంట్లోనే ఉండడం బెటర్ అని సూచిస్తున్నారు.
Read also : ఢిల్లీలో పొల్యూషన్ పంచాయతీ…?
Read also : వివాదంలో హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీ లేఔట్