
-
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
-
నూతన అధ్యక్షులుగా సబ్బు హరికృష్ణ రెడ్డి
-
ఉపాధ్యక్షులుగా మాండ్ర యాదగిరి యాదవ్
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మాడుగులపల్లి: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తానని గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు సబ్బు హరికృష్ణ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలం, పాములపహాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీని, గ్రామ అధ్యక్షుడిని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు సబ్బు హరికృష్ణ రెడ్డి మాట్లాడుతూ… గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు..
నూతన కమిటీ ఉపాధ్యక్షుడు మాండ్ర గిరి యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తీగల సతీష్, ప్రధాన కార్యదర్శి మామిడి సైదులు, కోశాధికారి నంద్యాల అంబేడ్కర్, యూత్ అధ్యక్షులు కునుకుంట్ల సతీష్, యూత్ ఉపాధ్యక్షులు తీగల శ్రీకాంత్ లను ఎన్నుకున్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..