అంతర్జాతీయం

ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు.. కానీ, ప్రస్తుతం చంపం: ట్రంప్

Israel-Iran Conflict: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఇప్పటి వరకు నేరుగా అడుగు పెట్టకపోయినా, జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కు మద్దతుగా, ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కెనడాలో జరుగుతున్న జీ7 సమావేశం నుంచి అర్థాంతరంగా అమెరికాకు వెళ్లిపోయిన ట్రంప్..  జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశం అయ్యారు. వెంటనే సిచ్చువేషన్ రూమ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు: ట్రంప్

ఇరాన్ సుప్రీం లీడర్ గా చెప్పుకుంటున్న సదరు నేత ఎక్కడున్నాడో తమకు తెలుసని.. ఖమేనీ గురించి ట్రంప్  వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఆయనను చంపే ఉద్దేశం తమకు లేదన్నారు. “ఇరాన్ సుప్రీం లీడర్‌ ఎక్కడ దాక్కున్నాడో మాకు కచ్చితంగా తెలుసు. ఆయను టార్గెట్ చేసి దాడి చేయడం మాకు చాలా ఈజీ. కానీ, ఆయనను ప్రస్తుతానికి చంపం” అని తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్టు పెట్టారు. అమెరికా పౌరులపై, అమెరికా సైనికులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్నారు. ఇరాన్‌ బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌ గగనతలం మొత్తం పూర్తిగా తమ కంట్రోల్ లో ఉందన్నారు. ఇరాన్ ఇద్దర స్కై ట్రాకర్లు, ఇతర పరికరాలు ఉన్నప్పటికీ, మా ఆయుధాలతో వాటికి పోలికే లేదన్నారు.

ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగాల తరలింపు

అటు ట్రంప్ తాజా హెచ్చరికల నేపథ్యంలో ఈశాన్య సిరియాలో ఉన్న రెండు బేస్‌ల నుంచి అమెరికా బలగాలు వైదొలగాయి. అయితే, వాటిని ఎక్కడికి తరలించారు అనేది తెలియడం లేదు. మరోవైపు అమెరికా నేవీలోని సూపర్‌ క్యారియర్‌, ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన 21 రీఫ్యూయెలింగ్‌ ట్యాంకర్లను అమెరికా నుంచి యూరప్ పంపుతున్నట్టు మీడియా వెల్లడించింది. అటు టెహ్రాన్‌ లో 3.3 లక్షల మంది ఉండే ఒక ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది.

Read Also: ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. ఇరాన్ అత్యున్నత సైనిక కమాండర్ మృతి!

Back to top button