తెలంగాణ

మరో 4 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్!

Telangana Weather Report: రాష్ట్రంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, నల్లగొండ, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇవాళ ఏ జిల్లాల్లో వానలు పడుతాయంటే?

ఇవాళ (గురువారం) కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నాడు ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్‌, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, ములుగు, నల్లగొండ, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్‌, వరంగల్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

శని, ఆదివారాల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

శనివారం నాడు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. హన్మకొండ, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూలు, నల్లగొండ, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వానలు పడనున్నట్ వెల్లడించింది. అక్కడక్కడే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం నాడు రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

Back to top button