తెలంగాణ

ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓటమిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బిజెపి మరియు టిఆర్ఎస్ రెండూ కలిసి కాంగ్రెస్ ను ఓడించాయని తీవ్రంగా ఆరోపించారు. అభ్యర్థిని పెట్టకుండానే బిజెపితో బిఆర్ఎస్ పార్టీ కుమ్మక్కు అయిందని తెలిపారు. కేటీఆర్ మరియు హరీష్ రావు నియోజకవర్గం లో ఎన్నికలు జరిగాయి.. మరి వాళ్ళు ఎవరికి ఓటేశారో చెప్పాలని అన్నారు. చాలా తక్కువ ఓట్లతోనే ఎన్నికలలో ఓడిపోయామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ఓటమిపై సమీక్షించుకుంటామని మీడియా వేదికగా ఆయన తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో మేము కిలోమీటర్ల తేడాతో ఏమి ఓడిపోలేదు చాలా తక్కువ ఓట్లతోనే ఓడిపోయామని అన్నారు. 2024 ఎన్నికలు జరిగినప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఆ రెండు పార్టీలకు 2000 ఓట్లు కూడా లేవని ఇప్పుడు ఇంత మెజార్టీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని మరోసారి తెలియజేశారు.

ఇవి కూడా చదవండి
1.కిషన్‌రెడ్డి – బండి సంజయ్‌ మధ్య క్రెడిట్‌ వార్‌ – ఎమ్మెల్సీల విజయం వెనుక ఎవరి పాత్ర ఎంత?

2.ఏసీబీకి చిక్కిన కోరుట్ల సబ్ ఇన్స్పెక్టర్…

3.సింగర్‌ కల్పన ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసింది..? విచారణలో విస్తుపోయే వాస్తవాలు..!

Back to top button