జాతీయం

తోకాడిస్తే సర్వ నాశనమే, ఉగ్రవాదులకు షా స్టాంగ్ వార్నింగ్!

Amit Shah Warning To Terrorists: ఉగ్రవాదులు తోక జాడిస్తే విధ్వంసం తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమిళనాడులోని మధురైలో జరిగిన బీజేపీ స్టేట్ లెవల్ లీడర్స్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన.. ప్రధాని మోడీ నేతృత్వంలో భారత దళాలు ఉగ్ర స్థావరాలను నామరూపాలు లేకుండా చేస్తున్నారని  వెల్లడించారు.

ఆపరేషన్ సిందూర్ పూర్తి కాలేదు!

పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రస్థావరాలను మాయం చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అని అమిత్ షా తేల్చి చెప్పారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పూర్తి కాలేదన్న ఆయన, ఉగ్రవాదులు మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడితే సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. భారత భద్రతా దళాలకు ప్రధాని మోడీ అపరిమిత అధికారాలను అప్పగించారని తెలిపారు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించే స్వేచ్ఛను ఇచ్చినట్లు వెల్లడించారు.

పాక్ కు వణుకు పుట్టించాం!

ఆపరేషన్ సిందూర్ తో పాటు ఆ తర్వాత జరిగిన ఘటనలకు ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాని అమిత్ షా గుర్తు చేశారు. భారత్ ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేస్తే, పాకిస్తాన్ సరిహద్దు గ్రామాలు, భారత ఆర్మీ స్థావరాలను టార్గెట్ చేసిందన్నారు. పాక్‌ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్‌లను మన సైనికులు కూల్చి వేశారని తెలిపారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు.

తమిళనాడులో బీజేపీదే అధికారం!

అటు తమిళ రాజకీయాలపైనా అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అటు ఈ పర్యటనలో భాగంగా అమిత్‌ షా మధురైలోని ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయంతో పాటు, సుందరేశ్వరర్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయన పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Read Also: మణిపూర్ లో మరోసారి ఆందోళనలు, సామూహిక ఆత్మాహుతికి యత్నం!

Back to top button