
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- చిరంజీవి తల్లి అంజనమ్మ అస్వస్థకు గురైన విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తల్లి ఆరోగ్యం విషయం గురించి స్పందించారు. మా అమ్మ అంజనమ్మ అస్వస్థకు గురి అయ్యి ఆసుపత్రిలో చేరారని వచ్చిన వార్తలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. రెండు రోజులుగా మా అమ్మ కేవలం అస్వస్థకు మాత్రమే గురైందని ఇప్పుడు చాలా బాగున్నారని అలాగే సంపూర్ణ ఆరోగ్యంతో ఉందంటూ తెలిపారు.
ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత నివేదికలను ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి చేస్తున్నా అని చిరంజీవి ట్విట్ చేశారు. కాగా గత రెండు మూడు రోజులుగా చిరంజీవి తల్లి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలలో ఇలాంటి అబద్ధపు వార్తలను ప్రచురించవద్దని మీడియాలకు మరియు సోషల్ మీడియా యూజర్లకు చిరంజీవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి