క్రైమ్తెలంగాణ

ఏసీబీకి చిక్కిన కోరుట్ల సబ్ ఇన్స్పెక్టర్…

జగిత్యాల (క్రైమ్ మిర్రర్):- జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్ బుధవారం అవినీతి నిరోధక శాఖ(ACB )చిక్కారు. ఇటీవల కోరుట్ల మండలం జోగినిపల్లి శివారులో గత నెలలో మామిడి తోటలో పేకాట ఆడుతూ ఎనిమిది మంది పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. దాడుల్లో పేకాటరాయుల వద్ద రూ. 23,000 నగదు స్వాధీనం చేసుకొని కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఎనిమిది మందిలో ఏడుగురికి సెల్ ఫోన్లు తిరిగి ఇచ్చేసిన, అందులో బండారు శ్రీనివాస్ అనే వ్యక్తి కి చెందిన సెల్ ఫోన్ మాత్రం ఇవ్వలేదు. ఫోన్ ఇచ్చేందుకు రూ 5000 డిమాండ్ ఎస్సై చేయగా బండారు శ్రీనివాస్ ఏసిబి అధికారులను ఆశ్రయించారు.

కోరుట్లలో బండారి శ్రీనివాస్ శంకర్ ఎస్సై రూ. 5000 ఇస్తుండగా ఏసీబీ డిఎస్పి రమణమూర్తి ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాగా ఈ ఏడాది ఏసీబీకి పట్టుబడిన ఘటన రెండవది. 266 గజాల స్థలాన్ని మార్టిగేజ్ చేయడానికి మెట్పల్లి సబ్ రిజిస్టర్ అసిపోద్దిన్ రూ. 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నెల రోజులు గడవకముందే కోరుట్ల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న శంకర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :-

1.లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేసిన మహిళా

2.సింగర్‌ కల్పన ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసింది..? విచారణలో విస్తుపోయే వాస్తవాలు..!

3.ప్రభుత్వ భూములు అమ్మకానికి కాంగ్రెస్ ప్రభుత్వం పన్నాగం: మాజీమంత్రి

Back to top button