తెలంగాణ

ఊసరవెల్లి రాజకీయాలు మానుకోండి :గోల్కొండ కిరణ్

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
మహాదే పూర్ మండలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ స్పందించి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. మహాదేవ్ పూర్ మండలంలోని కొందరు కాంగ్రెస్ నాయకులు అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోయి. ఊసరవెల్లిలా రంగులు మార్చి, తిన్నింటి వాసాలు లెక్కపెట్టే చందంగా వ్యవహరిస్తున్నరాని జరిగే వ్యవహారం అంత ప్రజలు గమనిస్తున్నారని.. గతంలో పుట్ట మధు ప్రోత్బలంతో అధికారాన్ని అనుభవించి. ఇప్పుడు గతాన్ని మరచి విమర్శలు చేయడం తగదని ఇలాంటి వారు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదని సదరు నాయకులని ఆ పార్టీ వారు కూడా నమ్మవద్దని, పుట్ట మధును విమర్శించి మెప్పు పొంది మళ్లీ పదవుల కోసమే ఇదంతా చేస్తున్నారని.. విమర్శలు మానుకొని ఎలక్షన్ సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల అమలుపై నియోజకవర్గ ఎమ్మెల్యే ( మంత్రి శ్రీధర్ బాబు..)పై ఒత్తిడి తీసుకువస్తే ప్రజలు హర్షిస్తారని కిరణ్ అన్నారు.

Back to top button