
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మాడుగులపల్లి:- అక్రమంగా 213 క్వింటాళ్ల(700 బస్తాలు) పీడీఎస్ బియ్యాన్ని లారీలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ వివరాలను వెల్లడించారు… హుజూర్నగర్, పాలకీడు, నేరేడుచర్ల, దామరచర్ల మరియు మిర్యాలగూడ పరిసర ప్రాంతాల నుండి సేకరించిన 700 బస్తాలు సుమారుగా 213 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని (ఎంహెచ్ 14 ఈఎఫ్ 5592) నెంబర్ గల 12 టైర్ల లారీలో లోడ్ చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాల సమయంలో మాడుగులపల్లి మండల కేంద్రంలోని టోల్గేట్ వద్ద టాస్క్ ఫోర్స్-1, సివిల్ సప్లై డిటి జావీద్, ఆర్ఐ సైదులు మరియు ఎస్సై మండల పోలీస్ సిబ్బంది తో కలిసి లారీని పట్టుబడి చేసినట్లు తెలిపారు. అనంతరం బియ్యం వ్యాపారి దివ్యల మౌనిష్, లారీ ఓనర్ సురేంద్ర శ్యామ్ రావు మూడే, లారీ డ్రైవర్ జిలాని ముస్తఫా షేక్ మరియు క్లీనర్ యువరాజు లక్ష్మణ్ ల పై సివిల్ సప్లై డిటి మరియు ఆర్ ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
పేరుకేనా మర్రిగూడ మోడల్ స్కూల్.. మోడల్ స్కూల్ అభివృద్ధి నిధులపై విచారణ జరపాలి
చండూరు టౌన్ లో రోడ్డు విస్తరణను పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశం