
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):-మండలంలోని లెంకలపల్లి గ్రామపంచాయతీ నందు, గ్రామ పంచాయతీ చెత్త ట్రాక్టర్ రాకపోవడంతో, ఇండ్లల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోతుందని సమాచారం..!? గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గత పది రోజుల నుండి గ్రామంలో ట్రాక్టర్ రాకపోవడంతో, పలుచోట్ల చెత్త పేరుకుపోయిందని, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. గ్రామపంచాయతీ వర్కర్ లు కూడా గ్రామంలోని పరిసర ప్రాంతాలను శుభ్రం చెయ్యటం లేదని..!?అందువల్ల గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తతో నిండిపోయిందని గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు.. ఈ చెత్త కారణంగా ఈగలు, దోమలతో ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉందని, ఎందుకు గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయిన చెత్తతో గ్రామం దుర్గంధం వెదజల్లుతుందని అధికారులపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.. గతంలో కూడా ఇలాంటి సమస్యే ఏర్పడిందని ప్రజలు అంటున్నారు.. అధికారుల సమస్య ఏదైనప్పటికి గ్రామంలో స్తంభించిపోయిన పరిశుభ్రత కార్యక్రమాలను వెంటనే పునరుద్దించాలని, ఇంటింటికి చెత్త ట్రాక్టర్లను పంపి గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. వెంటనే ఉన్నత అధికారులు స్పందించి, తక్షణమే పరిశుభ్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!