
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ బాలీవుడ్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ అనేది ప్లాస్టిక్ విగ్రహాల మ్యూజియం గా మారిపోయింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లోని నటులకు,ఆడియన్స్ కు మధ్య సంబంధం పూర్తిగా తగ్గిపోతుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే బాలీవుడ్ లోని అన్ని చిత్రాలు తమ మూలాలను కోల్పోతున్నాయి అని కుండలు బద్దలు కొట్టారు. చూడడానికి ఎంతో చక్కగా, అందంగా అలాగే అద్భుతంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ మ్యూజియంలోని విగ్రహాలలా ఉన్నాయి అని తాజాగా “కేరళ లిటరేచర్ ఫెస్టివల్” లో భాగంగా ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలి అంటే బాలీవుడ్ చిత్రాలు కన్నా తమిళ్ మరియు మలయాళ చిత్రాలు కంటెంట్ పరంగా చూస్తే చాలా క్రియేటివ్ గా ఉంటున్నాయి అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఏదో ఒక విషయంపై వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీకి గురవుతున్న ప్రకాష్ రాజ్ తాజాగా బాలీవుడ్ పై ఇటువంటి ప్రచారాలు చేయడంతో ఇది ఎంతటి వివాదాన్ని దారితీస్తుందో వేచి చూడాల్సిందే. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లోని కొందరి హీరోలపై విమర్శలు చేయగా ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ పైనే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read also : ఆత్మకూరు(ఎం)లో శ్రీ కనకదుర్గ అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం
Read also : Press: వాహనాలపై స్టిక్కర్లు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం





