జాతీయంరాజకీయం

చంద్రబాబు, నితీష్ అండలేకపోతే బిజెపి కూలిపోయేది : ఖర్గే

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఈమధ్య జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని బీజేపీ ప్రగల్భాలు పలికిందని కానీ చివరికి ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కూడా సాధించలేకపోయింది అని కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అండతో మోడీ సర్కార్ నడుస్తోంది చెప్పుకొచ్చారు. ఒకవేళ చంద్రబాబు, నితీష్ నరేంద్ర మోడీకి అండగా నిలవకపోతే కేంద్రంలో చక్రం తిప్పుతున్న నరేంద్ర మోడీ సర్కార్ కిందకు పడిపోయేదని అన్నారు. మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలలో నరేంద్ర మోడీ 400 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కానీ చివరికి చంద్రబాబు అలాగే నితీష్ కుమార్ సపోర్ట్ చేయడం వల్ల సులభంగా మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ చక్రం తిప్పుతున్నారు.

ఇవి కూడా చదవండి
1. చంద్రబాబు, నితీష్ అండలేకపోతే బిజెపి కూలిపోయేది : ఖర్గే

2.రఘురామకృష్ణరాజుకు షాక్!… సుప్రీంకోర్టు నుండి జగన్ కు భారీ ఊరట?

3.కూటమి ప్రభుత్వం ప్రజల ఆంక్షలను నెరవేరుస్తుంది : గవర్నర్

Back to top button