క్రైమ్తెలంగాణ

Sajjanar's warning: ఐ బొమ్మ రవిని పట్టుకుంటే పోలీసులపై మీమ్స్ సరికాదు

Sajjanar's warning: ఐ బొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి తన నెట్‌వర్క్‌ను కేవలం పైరసీ సినిమాల వరకే పరిమితం చేయకుండా, టెలిగ్రామ్ యాప్‌ను కూడా పెద్ద ఎత్తున వినియోగించాడని సీపీ సజ్జనార్ వెల్లడించారు.

Sajjanar’s warning: ఐ బొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి తన నెట్‌వర్క్‌ను కేవలం పైరసీ సినిమాల వరకే పరిమితం చేయకుండా, టెలిగ్రామ్ యాప్‌ను కూడా పెద్ద ఎత్తున వినియోగించాడని సీపీ సజ్జనార్ వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన మీడియా సమావేశంలో సజ్జనార్ ఈ ఘటనపై విస్తృతంగా మాట్లాడారు. పైరసీ ముసుగులో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను దూకుడుగా ప్రచారం చేసినట్లు తెలుస్తోందన్నారు.

ఐ బొమ్మ సైట్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన వెంటనే యూజర్లు నేరుగా బెట్టింగ్ యాప్ పేజీలకు మళ్లిపోయేలా అమరికలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సినిమాలు ప్లే అవుతున్న సమయంలో కూడా One Win, One X Bet వంటి యాప్‌ల ప్రకటనలు వరుసగా ప్రత్యక్షమయ్యే విధంగా వ్యవస్థను రూపొందించాడన్నారు. ఈ ప్రకటనల ద్వారా, యూజర్లను మోసగించి Apk ఫైల్స్ డౌన్‌లోడ్ చేయించే పద్ధతుల ద్వారా కోట్లు సంపాదించాడని తెలిపారు.

ఈ Apk ఫైల్స్ ద్వారా మొబైల్‌లోని వ్యక్తిగత డేటా మొత్తాన్ని దోచుకునే రీతిలో మాలిషియస్ కోడ్ అమర్చినట్లు తెలిసిందని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు ఒక్కసారి ఉచిత సినిమా అనే ఆశతో ఇలాంటి వెబ్‌సైట్ల జోలికి వెళ్లి తమ డేటా మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని అన్నారు. ఇలాంటి అక్రమ ప్లాట్‌ఫారమ్‌లను దూరంగా ఉంచాలని సజ్జనార్ ప్రజలను కోరారు.

ఇమ్మడి రవి ఒక దశలో పోలీసులను సవాలు చేస్తూ “దమ్ముంటే పట్టుకోండి చూద్దాం” అని అన్నాడని గుర్తు చేస్తూ, ఎన్నో నెలల పాటు కష్టపడి, రహస్యంగా నిఘా పెట్టి, సాంకేతిక ఆధారాలను సేకరించి, చివరకు అతడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని వర్గాలు సోషల్ మీడియాలో పోలీసులపై మీమ్స్ చేస్తున్న విషయం కూడా ఆయన ప్రస్తావించారు. ఇలాంటి మీమ్స్ చేయడం అనాగరికమని, ఇలాంటి చర్యలపై కూడా పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు.

ALSO READ: ATM Fraud: దొరికిన ఏటీఎం కార్డుతో నగదు విత్ డ్రా.. ఆ తర్వాత ఏమైందంటే..?

Back to top button