తెలంగాణ

పంజా విసిరిన హైడ్రా.. కూకట్ పల్లి, మణికొండలో కూల్చివేతలు

హైదరాబాద్‌లో హైడ్రా మళ్లీ కొరడా ఝులిపిస్తోంది.కూకట్ పల్లిలో మళ్లీ హైడ్రా బుల్డోజర్లు రోడ్డెక్కాయి. హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చేతలు చేపట్టింది. సర్వేనెంబర్ 145/3 లో అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లు, బారికేడ్లను బుల్‌డోజర్లతో తొలగిస్తున్నారు అధికారులు. భారీగా పోలీసులను మోహరించారు. మీడియాను అనుమతించడం లేదు. ఈ భూమికి సంబంధించి ఇటీవలే కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అక్రమంగా వెలిసిన షెడ్లను తొలగించి స్వాధీనం చేసుకుంటోంది హైడ్రా.

మరోవైపు డైమండ్ హిల్స్ కాలనీవాసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ధన్యవాదాలు అంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఫిర్యాదు ఇచ్చిన వారం రోజుల్లోనే తమ సమస్యను పరిష్కరించారని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సామాన్యుల పట్ల హైడ్రా అధికారులు అండగా నిలుస్తున్నారని అన్నారు.

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాలర్ హిల్స్ కాలనీలో పార్కు స్థలం కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.పార్క్ స్థలం కబ్జాకు గురైందని 15 రోజుల క్రితం హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు డాలర్ హిల్స్ కాలనీ వాసులు. మే 14న డాలర్ హిల్స్ కాలనీ లో స్థలాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్. ఇవాళ ఆపరేషన్ చేపట్టారు. తెల్లవారుజామున భారీ బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు.పార్క్ కబ్జాకు గురైందని మూడు సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ , హెచ్ఎండిఏ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవలేదని స్థానికులు అన్నారు. హైడ్రాలో కంప్లైంట్ ఇచ్చిన 15 రోజులకే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సలాన్ని పరిశీలించడం.. చర్యలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు డాలర్ హిల్స్ కాలనీ వాసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button