ఆంధ్ర ప్రదేశ్క్రైమ్

VRO ను లైంగికంగా వేధిస్తున్న MRO.. రంగంలోకి దిగి బడితెపూజ చేసిన వీఆర్వో తల్లి!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- తెలుగు రాష్ట్రాల్లో కామాంధులు రోజు రోజుకు బరితెగిస్తున్నారు. తాజాగా ఒక కామాంధుడైన ఎమ్మార్వో తోటి మహిళా VRO ను కొన్ని రోజులుగా వేధిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో జరగగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని ఒక కామాంధుడైన ఎమ్మార్వో కొద్ది రోజులుగా నాయుడుపేటలో నివాసం ఉంటున్న మహిళ వీఆర్వోను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు. ‘ మీ ఇంటికి వస్తా… కోడి కూర వండి పెడతావా?.. అలాగే అడిగింది ఇస్తావా?.. అని ప్రతిరోజు మెసేజెస్ పెడుతూ ఉన్నాడు. అంతటితో ఆగకుండా బరితెగించి నేరుగా VRO ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్లిన ఎమ్మార్వో బట్టలు విప్పి… నా కోరిక తీర్చాలంటూ వీఆర్వోను వేధిస్తూ ఉండగా, వెంటనే ఆ మహిళా వీఆర్వో తన తల్లికి ఫోన్ చేసి సమాచారం అందించింది. ఇక వెంటనే రంగంలోకి దిగిన ఆమె తల్లి అతడికి బడితెపూజ చేసింది. ఎమ్మార్వోను చిక్కిందే సందు అని… చితక బాధిపెట్టింది.

Read also : నేను ఎలాంటి తప్పు చేయలేదు.. త్వరలోనే అన్నీ బయట పెడతా : డాక్టర్ నమ్రత

తోటి మహిళా ఉద్యోగి రాలి పై ఒక బాధ్యత తెలిసిన ఎమ్మార్వో ఇలా చేయడమేంటని ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. ఇలాంటి వారికి పోలీసు అధికారులు సరైన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. వీఆర్వో తల్లి వెంటనే రావడంతో సరిపోయింది కానీ లేదంటే ఎమ్మార్వో చేతిలో వీఆర్వో బలి అనే హెడ్లైన్ వాడాల్సి వచ్చేదని… ఆ తల్లి ధైర్య సాహసాలకు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ సలాం కొడుతున్నారు.

Read also : సీఎం రేవంత్‌రెడ్డికి బిగ్‌ రిలీఫ్‌

One Comment

Back to top button