ఆంధ్ర ప్రదేశ్

ఎన్ని అడ్డంకులు వచ్చిన జగన్ ను విడిచి వెళ్లేదే లేదు :- పేర్ని నాని

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమపై ఒత్తిడికి పాల్పడుతుందని… కక్ష సాధింపు చర్యలకు గురిచేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇలాంటివి ఎన్ని కక్ష సాధింపు చర్యలు చేపట్టినా కూడా భయపడేది లేదు అని వైసిపి నేత పేర్ని నాని అన్నారు. స్వయానా కూటమి మంత్రి వెళ్లి బియ్యాన్ని పట్టుకున్న కూడా ఎలాంటి క్రిమినల్ కేసులు నాపై పెట్టలేదని విమర్శించారు. మీరు ఎన్ని చేసినా కూడా రాబోయేది జగన్ ప్రభుత్వమే అని… ఎవరు కూడా చట్టం నుంచి తప్పించుకోలేరని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీరు ఎన్ని కుట్ర చర్యలు చేసిన.. ఎన్ని పన్నాగాలు పన్నినా కూడా నేను జగన్ ను, వైసీపీ పార్టీ ని విడిచేదే లేదని పేర్ని నాని చెప్పుకొచ్చారు. కాగా పేర్ని నాని సతీమణి జయసుధకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. మరి ఆ కేసు పై ఇవాళ విచారణ జరగనుంది. అయితే కొద్ది రోజుల క్రితం పేర్ని నానికి సంబంధించిన అక్రమ బియ్యాన్ని కూటమి మంత్రి పట్టుకున్న విషయం అందరికీ తెలిసింది.

  1. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్… 3,4 తేదీల్లో వర్షాలు

  2. బిగ్ బ్రేకింగ్… మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్!.. మరి మోనాలిస పరిస్థితి ఏంటి?

Back to top button