మర్రిగూడ: అడ్డు అదుపు లేని అక్ర‌మ కోళ్ల ఫారం నిర్మాణం..!

  • అడ్డు అదుపు లేని అక్ర‌మ నిర్మాణాలు
  • ఇప్పుడున్న కోళ్ల‌ఫారంతోనే త‌ట్టులేక‌పోతున్నాం
  • ఈగ‌లు,దోమ‌లు వృద్ది చెంది రోగాల భారిన‌పడుతున్నాం
  • కొత్త‌గా మ‌రొక‌టి అక్ర‌మ కోళ్ల ఫారం నిర్మాణం
  • అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లోపమా….?
  • రేకెత్తిస్తున్నా ప‌లుఅనుమానాలు
  • చ‌ర్య‌లు తీసుకోకుంటే ఇక ఆందోళ‌న‌లే !

​నల్గొండ ప్రతినిధి (క్రైమ్ మిర్రర్):- మర్రిగూడ మండల పరిధిలోని దామెర భీమనపల్లి గ్రామ శివారులో అక్ర‌మ నిర్మాణాల‌కు అడ్డు అదుపులేకుండా పోతుంది. సర్వే నంబర్ 581లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న కోళ్ల ఫారం షెడ్డుపై, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​

మర్రిగూడ: అడ్డు అదుపు లేని అక్ర‌మ కోళ్ల ఫారం నిర్మాణం..!
మర్రిగూడ: అడ్డు అదుపు లేని అక్ర‌మ కోళ్ల ఫారం నిర్మాణం..!

ఈ అక్రమ నిర్మాణంపై గతంలోనే గ్రామస్తులు, ఎంపీడీవోకు, గ్రామ పంచాయతీ కార్యదర్శికి లిఖితపూర్వక ఫిర్యాదులు అందించిన‌ప్ప‌టికీ చ‌ర్య‌లుతీసుకోక‌పోవ‌డం ప‌లు అనుమ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అధికారుల‌కు ఫిర్యాదులు చేసిన‌ప్ప‌టికీ ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్ర‌జ‌లు ఆవేద‌న చెందుతున్నారు.

గ్రామంలో ఇప్ప‌టికే ఒక కోళ్ల షెడ్డు ఉన్న కార‌ణంగా వాటి నుంచి వెలువ‌డే దుర్వాస‌న‌కు శ్వాస దీసుకోడం ఇబ్బంది పడుతున్నామ‌ని, అంతేగాకుండా ఈగ‌లు, దోమ‌లు వృద్ది రోగాల భారిన‌ప‌డుతున్నాని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ​ఇప్పుడు కొత్తగా మరో అక్రమ షెడ్డు నిర్మిస్తే, గ్రామంలో నివసించే పరిస్థితి ఉండదని, ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాల్సి వస్తుందని ప్రజలు తమ బాధను వ్యక్త పరుస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లోప‌మా…? ఫిర్యాదులు చేసిన ప‌ట్టించుకోవ‌డంలో అంత‌ర్య‌మేమిటో…?

నల్గొండ జిల్లా, మర్రిగూడ మండ‌ల ప‌రిధిలో అక్ర‌మంగా కోళ్ల షెడ్డు నిర్మాణాలు జ‌రుగుతున్న అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లోపం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ప్రస్తుతం ఉన్న కోళ్ల‌ షెడ్డునుంచి వ‌చ్చే దుర్వాస‌న‌తో త‌ట్టుకుంటా లేమంటే మ‌రొక‌టి అక్ర‌మంగా నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా నిర్మాణ ద‌శ‌లో ఉంద‌ని అది కూడ పూర్త‌యితే మేము ఇక ఊరెళ్లి పోవ‌డ‌మే అనిఆవేద‌న చెందుతున్నారు.

మర్రిగూడ: అడ్డు అదుపు లేని అక్ర‌మ కోళ్ల ఫారం నిర్మాణం..!
మర్రిగూడ: అడ్డు అదుపు లేని అక్ర‌మ కోళ్ల ఫారం నిర్మాణం..!

ఇదే విష‌య‌మై అధికారుల‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ప‌ట్టించుకోక పోవ‌డంలో అంత‌ర్య‌మేమిటో అని ప్ర‌జ‌లు ఆవేద‌న చెందుతున్నారు. అధికారులు మొద్దు నిద్ర వీడి అక్ర‌మంగా నిర్మాణం చేపడుతున్న వారిపై క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకోని వాటి నిర్మాణాల‌ను ఆపి వేయాల‌ని దామెర భీమనపల్లి సర్పంచ్ అలివేలు కృష్ణయ్య, దోమల వెంకన్న, అచ్చిని సైదులు, కర్నాటి వెంకట్ గౌడ్, అంబల్ల రవి, ఐతరజు రమేష్, జిల్లా కిషోర్, పక్రుద్దీన్, పగిల్ల సైదులు, పంతంగి మహేశ్, గ్రామస్తులు కోరుతున్నారు. అక్ర‌మ నిర్మాణాన్ని ఆపి వేయ‌కుంటే ఆందోళ‌న‌లు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button