క్రీడలు

SRH జట్టు ను వెంటాడుతున్న దురదృష్టం!… 300 వద్దులే గానీ 150 కొట్టండి చాలు అంటున్న ఫ్యాన్స్?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును దురదృష్టం వెంటాడుతుంది. గత సంవత్సరంలో బ్యాటింగ్ తో అలాగే బౌలింగ్ తో ప్రత్యర్థులపై విరుచుకుపడిన SRH జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితిలను ఎదుర్కొంటుంది. గత సీజన్ లో 200, 250, 280 అలాగే 290 లాంటి పరుగులు చేసిన హైదరాబాద్ జట్టు ఈ సంవత్సరం మాత్రం 200 చేయాలంటేనే చాలా కష్టంగా మారింది. గత సంవత్సరంలో ఓపినర్లు హెడ్ అలాగే అభిషేక్ శర్మ ఇద్దరూ కూడా తమ బీకరమైన బ్యాటింగ్ తో భారీ స్కోరులను నమోదు చేశారు. కానీ ఈ సంవత్సరం మాత్రం పవర్ ప్లే లోనే ఇద్దరు కూడా అవుట్ అయిపోయి జట్టు పరాజయానికి తోడు అవుతున్నారు. గత సంవత్సరం బ్యాటింగ్ లైనప్, అలాగే ఈ సంవత్సరం బ్యాటింగ్ లైన్ అఫ్ సెమ్ అయినా కూడా ఈ సంవత్సరం మాత్రం SRH జట్టు కు కలిసి రావడం లేదు.

గత సంవత్సరం ఎంతోమంది ప్రేక్షకుల నుండి, అలాగే దేశ విదేశాల నుండి ఎస్ఆర్హెచ్ జట్టుకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. కానీ ఈ సంవత్సరం మొత్తం అదంతా కూడా వెను తిరిగేటువంటి అవకాశం ఉంది. గత సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా ఫ్యాట్ కమీన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. కానీ గత సీజన్లో ఎస్ ఆర్ హెచ్ ఆడిన విధానం… ఈ సీజన్లో ఎస్ ఆర్ హెచ్ ఆడిన విధానంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిలో ప్రారంభంలో మొదటి మ్యాచ్ లోనే ఏకంగా 286 పరుగులు చేసి ఈ సంవత్సరం కూడా రికార్డులు సృష్టించేలా ఎస్ఆర్హెచ్ జట్టు కనపడింది. కానీ ఆ తరువాత జరిగిన మూడు మ్యాచ్లలో పరాజయం పాలయ్యింది. ఓపినర్లు అభిషేక్ శర్మ మరియు హెడ్ఇద్దరు కూడా పవర్ ప్లే లోనే అవుట్ అవ్వడంతో జట్టు పరాజయం పొందుతోంది. అలాగే తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు అందరూ కూడా తక్కువ పరుగులే చేస్తూ… జట్టు పరాజయానికి తోడువుతున్నారు. ఈ సంవత్సరం కెప్టెన్ పాట్ కమ్మిన్స్ నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. దీంతో ప్రత్యర్థుల జట్లు సులభంగా గెలుస్తున్నారు.

ఇక నిన్న, మొన్నటి వరకు SRH జట్టు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది 250 లేదా 300 పరుగులు. ఎస్ఆర్హెచ్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ అయితే కచ్చితంగా 250 పైగా పరుగులు చేస్తారని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం 200 పరుగులు చేయాలంటేనే దడదడలాడుతున్నారు. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు అలాగే క్రికెట్ అభిమానులు అందరూ కూడా 300 వద్దులే కానీ… కనీసం అందులో సగం 150 పరుగులైన చేయండి అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. మరి తర్వాత మ్యాచ్లో అయినా ఎస్ఆర్ఎస్ జట్టు బ్యాట్స్మెన్లు మంచిగా ఆడతారో లేక మళ్ళీ విఫలమవుతారో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button