అంతర్జాతీయం

20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ యువరాజు మృతి!

Sleeping Prince Death:  కారు ప్రమాదంలో గాయపడి 20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ యువరాజు  అల్‌ వలీద్‌ బిన్‌ ఖాలీద్‌ బిన్ తలాల్‌ అల్ సౌద్‌ తుదిశ్వాస విడిచాడు.  36 ఏళ్ల వసున్న ఆయన శనివారం కన్నుమూసినట్లు సౌదీ రాజ కుటుంబ ప్రకటించింది. అల్‌ వలీద్‌ తండ్రి ఖాలీద్‌ బిన్‌ తలాల్‌ అల్‌ సౌద్‌ ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా కన్ఫార్మ్ చేశారు. ఎక్కువ కాలం కోమాలో ఉన్న అల్ వలీద్ స్లీపింగ్ ప్రిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎప్పుడో ఒకసారి కోమా నుంచి బయటకు వస్తాడని భావించిన రాజ కుటుంబానికి చివరికి విషాదమే మిగిలింది.

ఎవరీ ప్రిన్స్.. ఎందుకు అన్నేళ్లు కోమాలో ఉన్నాడు?

సౌదీ యువరాజు అల్‌ వలీద్‌ 1990 ఏప్రిల్‌లో సౌదీ రాజు ఖాలీద్‌ బిన్‌ తలాల్‌ అల్‌ సౌద్‌ దంపతులకు జన్మించాడు. ఆయన బ్రిటన్‌ లోని మిలిటరీ కాలేజీలో చదివే సమమంలో 2005లో ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన కోమాలోకి వెళ్లాడు. అప్పటి నుంచి కోమాలో ఉన్న యువరాజుకు రియాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ట్యూబ్ ద్వారా ఆహారం అందించేవారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నప్పటికీ కోలుకునే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగితే ఆయన బతికే అవకాశం ఉందని ఆ చికత్స అలాగే కొనసాగించారు. 2019లో వలీద్‌ చేతివేళ్లు కదిలించడం, తలను తిప్పాడు. ఆయన కోలుకుంటాడని అందరూ భావించారు. కానీ, మళ్లీ యథాస్థితికి చేరుకున్నాడు. రీసెంట్ గా ఆయనకు 36 పుట్టిన రోజు వేడుకులు జరిగాయి. తాజాగా ఆయన చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

Read Also: మాతో గేమ్స్ వద్దు.. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక!

Back to top button