
క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:- పాకిస్తాన్ జరిపినటువంటి వైమానిక దాడుల్లో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్లేయర్లు మృతిచెందారు. వీరందరూ డొమెస్టిక్ క్రికెటర్లు కాగా… పాకిస్తాన్ పిరికిపంద చర్యకు ఉరుగన్ జిల్లాకు చెందిన ముగ్గురు క్రికెటర్లను కోల్పోయామని అంటూ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. కబీర్, సిగ్బతుల్లా, హరుణ్ అనే ముగ్గురు క్రికెట్ ప్లేయర్లును కోల్పోయామంటూ పేర్కొంది. వీళ్ళ మృతి మన స్పోర్ట్స్ కమ్యూనిటీకి తీరని లోటు అన్నారు. మృతి చెందిన వారికి శాంతి కలిగేలా త్వరలో జరగబోయేటువంటి పాకిస్తాన్ మరియు శ్రీలంక మధ్య ట్రై సిరీస్ నుండి తప్పుకుంటున్నామని స్పష్టం చేశారు. కాగా పాకిస్తాన్ జరిపినటువంటి ఈ దాడిలో ముగ్గురు క్రికెటర్లతో పాటుగా మరో ఐదు మంది పౌరులు చనిపోయారు. మొత్తంగా ఎనిమిది మంది చనిపోయినట్లుగా ఆఫ్ఘనిస్తాన్ అధికారులు ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ దేశంపై పలు దేశాల నెటిజనులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఇలాంటి పాకిస్తాన్ దేశాన్ని ఊరికే వదలకూడదని మరి కొంతమంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మరికొన్ని దేశాల ప్రముఖులు ఇప్పటికే ఈ ఘటనపై స్పందిస్తూ ఖండిస్తున్నారు.
Read also : సాయంత్రం 5 గంటలకు గ్రూప్ 2 నియామక పత్రాలు పంపిణీ!
Read also : తెల్లవారుజామునే రోడ్డు ఎక్కిన బీసీ సంఘాలు.. ఎవరికి వ్యతిరేకంగా ఈ బంద్?