
షైన్ టామ్ చాకో… మలయాళ నటుడు. నాని హీరోగా నటించిన దసరా సినిమాలో విలన్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేస్తాడు. ఈయన గారి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. డ్రగ్స్ వినియోగం.. తోటి నటులతో అసభ్యకరంగా ప్రవర్తించడం… పోలీసులు వచ్చే సరికి గోడ దూకి పారిపోవడం. ఒక్కటా రెండా… అయ్యగారి సిత్రాలు ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో…? అన్నీ లెక్క తేలుస్తామంటున్నారు పోలీసులు.
అసలు ఏం జరిగిందంటే… కేరళలోని కొచ్చిలో ఒక హోటల్‌పై గురువారం (మార్చి 17) రాత్రి పోలీసులు రైడ్స్ చేశారు. డ్రగ్స్ అమ్ముతున్నట్టు సమాచారం రావడంతో హోటల్‌పై దాడులు చేశారు. అయితే… పోలీసులు వస్తున్నారని తెలిసి… టామ్ చాకో అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు చెప్తున్నారు. హోటల్లో మూడు అంతస్తులోని కిటీకీలో నుంచి రెండో అంతస్తులోకి దూకి.. అక్కడి నుంచి మెట్లపై వెళ్లినట్టు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఒక బైక్‌లో అతను వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అయితే… ఆ బైక్ ఎవరిది అన్నది క్లారిటీ లేదు. తెలిసిన వాళ్ల బైక్‌లో వెళ్లాడా…? లేదా ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్లాడా…? అన్న దానిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. టామ్ చాకో కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెల్లవారుజామున ఒక ఫైవ్‌స్టార్ హోటల్లో చెక్ఇన్ చేసి… మూడున్నగంటల సమయంలో త్రిసూర్ వైపు వెళ్లినట్టు భావిస్తున్నారు. షైన్ టామ్ చాకో ఉండేది త్రిసూర్‌లోనే. అయితే… అతని ఇంటికి వెళ్లిన దాఖలాలు లేవు. దీంతో… పోలీసుల గాలింపు కొనసాగుతోంది. టామ్ చాకోకి నోటీసులు ఇచ్చి.. ప్రశ్నించాలని భావిస్తున్నారు పోలీసులు.
Also Read : కుక్క కోసం ఈడీ సోదాలు.. బెంగళూరులో కలకలం
మరోవైపు… టామ్ చాకోపై తోటి నటి విన్సీ సోనీ అలోషియస్ లైగింక వేధింపుల ఆరోపణలు చేసింది. సినిమా షూటింగ్ సందర్భంగా… తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపింది. డ్రగ్స్ తీసుకుని వచ్చి… తన ముందే బట్టలు మార్చుకోమని బలవంతం చేశాడని ఆరోపించింది. ఆ సమయంలో అతని నోట్లో నుంచి తెల్లని పౌడర్‌ను ఉమ్మేశాడని… అది చూసి అతను డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని అంటోంది. సూత్రవాక్యంసెట్లో ఇలా జరిగింది. ఈ విషయం డైరెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లానని.. ఆయన టామ్ చాకోని హెచ్చరించినట్టు తెలిపింది. ఆ తర్వాత.. అతనిపై కేరళ ఫిల్మ్ ఛాంబర్‌తోపాటు అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ‘అమ్మా’కు ఫిర్యాదు చేసింది విన్సీ. టామ్ చాకోపై ఆమె చేసిన ఆరోపణల వీడియో కూడా వైరల్ అవుతోంది. వరుస వివాదాలతో నటుడు టామ్ చాకో తీరు వివాదాస్పదమైంది. అతన్ని.. ఏ క్షణంలో అయినా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి ..
-
సూర్యాపేటలో ఫేక్ హాస్పిటల్.. డాక్టర్ పై ఫోర్జరీ కేసు
-
నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!
-
అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్
-
సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్
-
ఏపీలో లిక్కర్ స్కామ్ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్ వైపుకా..!