తెలంగాణ

శిథిలావస్థ భవనాలకు పై పై పూతలు!.. శాశ్వతంగా ఉండాలని తెలిసిన ప్రజా సొమ్ము వృధా?

క్రైమ్ మిర్రర్ / వికారాబాద్ జిల్లా ప్రతినిధి:-ప్రజాసొమ్ముతో పనులు చేస్తున్నప్పుడు అవి శాశ్వతంగా ఉండేలా చూడాలి.ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా ఖర్చు పెట్టాలి.కానీ వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.గత 30 ఏండ్ల క్రితం నిర్మించిన ప్రభుత్వ బాలుర బిసి వసతి గృహం అదే 40 ఏంద క్రితం నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరాయి. వాటిని కూల్చి వేసి నూతన భవనాలు నిర్మించాల్సి ఉండగా అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదు.శిథిల భవనాలకు మరమ్మత్తులతో కొత్త పూతలు పూయిస్తూ మమ అనిపిస్తున్నారు. బీసీ వసతి గృహంలో విద్యార్థుల గదులు పగుళ్లు, పెచ్చులూడిపోగా పగుళ్లు వచ్చిన చోట సిమెంట్ పూసి మసి పూసి మారేడు కాయ అన్నట్లుగా పనులు కొనసాగిస్తున్నారు.ఈ మరమ్మత్తుల పనులు చూసిన మండల ప్రజలందరూ కొత్త భవనాలు నిర్మించాల్సి చోట కూలిపోయే భవనాలకే మరమ్మత్తు పనులు చేయించడం పై విమర్శలు చేస్తున్నారు.

మరమ్మత్తు పనులపై సర్వత్రా విమర్శలు…!

నవాబ్ పేట్ మండలంలో ప్రభుత్వ బీసీ వసతి గృహం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరాయి.బీసీ వసతి గృహంలో గదులు పై నుండి పెచ్చులూడి పడుతున్నాయి.కొత్త భవనాలు నిర్మించాలని పలుమార్లు మండల వాసులు,విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు,ఆస్పత్రికి వచ్చే రోగులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ అధికారులు మాత్రం కొత్త భవనం స్థానంలో పెచ్చులుడి పడుతున్న భవనాలకు మరమ్మతు చేస్తున్నారు.రంగులు వేసి అందంగా చేస్తున్నారు. కానీ వీటి వలన ప్రజాధనం వృధా అవడమే కాకుండా ఉపయోగం లేదనే ప్రజల నుండి అభిప్రాయం వినిపిస్తోంది.ఇలాంటి పనులు చేయిస్తున్న అధికారులు వాటి నాణ్యత విషయం కూడా ఆలోచించాలిగా అని మండల వాసులు అంటూన్నారు.

నిధులు ఖర్చుచేయడం పై ఉన్న శ్రద్ధ…!

గత కొన్ని ఏళ్ల క్రితం నిర్మించిన ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరడం జరిగింది. వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించాల్సిన అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు.ఎంతకాలం మన్నికతో ఉంటుందో తెలియక ఆస్పత్రి సిబ్బంది రోగులు బిక్కుమక్కుమంటున్నారు.అధికారులు లోపం కారణంగా ప్రజలకు,విద్యార్థుకు ఏ మాత్రం ఉపయోగపడకుండా పోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులకు నిధులు ఖర్చుచేయడంపై ఉన్న శ్రద్ధ పనుల నాణ్యతపై ఉండడం లేదని విమర్శలు వస్తున్నాయి.లక్షల రూపాయలతో మరమ్మత్తులు చేస్తూ పైపై పూతల్లా తయారయ్యాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రజాధనాన్ని వృధా చేయకుండా శిధిలావస్థకు చేరిన భవన స్థానంలో కొత్త వాటిని నిర్మాణం చేపట్టేలా పర్యవేక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

కొత్త భవనం నిర్పించాలి…!

నవాబ్ పేట్ ఎంపీటీసీ పద్మనాగిరెడ్డి..!

కనీస వసతులు లేని అద్దె భవనంలో హాస్టళ్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీంతో వారు చదువుకోలేని దుస్థితి నెలకొందన్నారు. మండలంలో ఆసుపత్రి, బీసీ వసతి గృహం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి వాటిని మరమ్మతులు చేయడం సరైనది కాదు. కూలిపోయే భవనలకు మరమ్మత్తులు ఎందుకు..? జిల్లా కలెక్టర్ దీనిపై చొరవ చూపి కొత్త భవనాన్ని మంజూరు చేసి నిర్మాణం కొనసాగేలా చూడాలి.

పాత భవనానికి మరమ్మత్తులు ఎందుకు…?

నవాబ్ పేట్ మాజీ సర్పంచ్ విజయలక్ష్మి ప్రకాశం…!

కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న బీసీ వసతి గృహం,మరమ్మత్తులు చేసిన ప్రభుత్వ ఆసుపత్రి వర్షాకాలం వస్తే మళ్లీ కురుస్తుంది.విద్యార్థులకు, వైద్యులకు రోగులకు భద్రత లేని భవనానికి మరమ్మత్తు చేస్తే జరగరానిది జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు.ఎంతకాలం ఉంటుందో తెలియని భవనానికి పైపై పూతలు,పూసి రంగులు వేసి పక్క భవనంగా అప్పజెప్పడం సరైనది కాదు. అధికారులు దీనిపై దృష్టి సాధించి నూతన భవనాన్ని నిర్మించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button