
కాపులు.. ఏపీలో వీరిది బలమైన సామాజికవర్గం. ఎన్నికల్లో గెలుపోటములను కూడా వీరు డిసైడ్ చేయగలరు. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వీరిని బలిజలు అంటారు. కోస్తాంధ్రకు వచ్చే సరికి.. కాపులుగా పిలుస్తారు. అయితే… మొదటి నుంచి వీరు తెలుగుదేశం పార్టీకే కాపు కాస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత… ఆయన్నే తమ నాయకుడిగా అనుకుంటున్నారు మెజార్టీ కాపులు. ఈ విషయం గ్రహించిన చంద్రబాబు.. గత ఎన్నికల్లో జనసేనతో పొత్తుపెట్టుకున్నారన్న చర్చ కూడా ఉంది. కాపులంతా కూటమికి కొమ్ముకాయడంతో… అంతటి భారీ విజయం వచ్చిందనేది కొట్టిపారేయలేని వాస్తవం. అయితే ఇప్పుడు కాపుల్లో కుమ్ములాటలు మొదలయ్యాయి. పదవుల విషయంలో జనసేనలో కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటే.. చంద్రబాబు మాత్రం ఆ సామాజికవర్గాన్ని అంతగా పట్టించుకోవడం లేదన్న వాదన ఉంది. దీంతో… టీడీపీలో కాపు నేతలు కోపంతో రగిలిపోతున్నారట.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్… తన సామాజికవర్గాన్ని అందలం ఎక్కిస్తున్నారు. ఎన్నికల వేళ… పొత్తులో భాగంగా… జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు చంద్రబాబు. వీటిలో అత్యధిక సీట్లను కాపు సామాజికవర్గానికే ఇచ్చారు పవన్ కళ్యాణ్. రెండు పార్లమెంట్ స్థానాలను కూడా కాపు నాయకులే ఇచ్చుకున్నారు. అలాగే… మంత్రివర్గంలో జనసేనకు మూడు పదవులు వస్తే… అందులో రెండు కాపులకు, ఒకటి కమ్మ నేతకు ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో ఒకటి జనసేనకు వస్తే… దాన్ని కూడా తన సోదరుడు నాగబాబుకు ఇచ్చారు పవన్ కళ్యాణ్. నాగబాబును త్వరలోనే కేబినెట్‌లోకి తీసుకోబోతున్నారని సమాచారం. అదే జరిగితే… జనసేన నుంచి ముగ్గురు కాపు నేతలకు ఏపీ కేబినెట్‌లో స్థానం దక్కినట్టు అవుతుంది.
Read More : ప్రచారాలు నమ్మకండి… బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు?
ఇక.. టీడీపీ విషయానికి వస్తే.. చంద్రబాబు మాత్రం కాపు నాయకులకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడంలేదని సమాచారం. మిత్రపక్షమైన జనసేన కాపులను అక్కునచేర్చుకుంటుంది కనుక.. తాను చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు అనుకున్నారో ఏమో గానీ… ఇద్దరు కాపులకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు. దీంతో.. టీడీపీలోని కాపు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో కాపులకు అంత ప్రాధాన్యత ఇస్తుంటే… తమకెందుకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారట. నామినేటెడ్ పదవుల్లో అయినా.. తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారట టీడీపీ కాపులు. ఈమధ్యనే ప్రభుత్వ సలహాదారులుగా నలుగురిని నియమించారు. వారిలో కూడా కాపులు లేరు. దీంతో… టీడీపీలో ఉంటే… తమకు ఎప్పటికీ న్యాయం జరగదనే ఆలోచనకు వచ్చేశారట కాపులు. టీడీపీ-జనసేన పొత్తు ఉన్నంత కాలం తమ పరిస్థితి ఇంతే అని… రాజకీయంగా భవిష్యత్ ఉండదని బాధపడుతున్నారట టీడీపీలోని కాపు నాయకులు. కడపలో జరిగిన బలిజ సామాజికవర్గ సమావేశంలో… కాపులు ఇదే విషయంపై చర్చించి.. తమ అసంతృప్తిని వ్యక్తం చేశారట. పరిస్థితి చేయిదాటకముందే మేలుకోవాలని… తమకు మేలు చేసే పార్టీవైపు నిలబడాలని భావిస్తున్నారట. మరి.. కాపుల్లో ఐక్యత నిలబడుతుందా…? భవిష్యత్‌లో ఏం జరుగుతుంతో చూద్దాం.
ఇవి కూడా చదవండి …
-
జగన్‌కు ఏడుగురు ఎమ్మెల్యేల వెన్నుపోటు – రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారుగా…!
-
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం!..
-
కాలం తెచ్చిన కరువు కాదు… పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువే.
-
టీడీపీని తొక్కుకుంటూ పైకొస్తున్న జనసేన – తిరుపతి చంద్రబాబు పర్యటనే సాక్ష్యం
-
2029లో టీడీపీ అధికారంలో ఉండటం కష్టమేనా – చరిత్ర ఏం చెప్తోంది..?