తెలంగాణ

హైదరాబాద్ లో భారీ వర్షం, అధికారుల హెచ్చరికలు!

Hyderabad Rains: హైదరాబాద్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. నగరం అంతగా జనజీవనం స్తంభించింది. సికింద్రాబాద్ అంతటా వాన దంచికొట్టింది. బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యారడైజ్,  బేగంపేట ప్రాంతాలలో వర్షం పడుతూనే ఉంది.  రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రయాణీకులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.

పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం  

అటు గాలి వాన ధాటికి పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాకు ఆటంకం కలిగింది. పంజాగుట్ట, లక్డీ కపూల్, మలక్‌ పేట, యూసుఫ్‌ గూడ, జూబ్లీహిల్స్, షేక్‌ పేట, ఖాజాగూడ, మణికొండ, మేడ్చల్, హిమాయత్‌ నగర్, నారాయణగూడ సహా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులలో కూడిన వాన పడింది. మణికొండ, అత్తాపూర్ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది.

మరో రెండు రోజుల పాటు వానలు

అటు హైదరాబాద్ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని వెల్లడించింది. ఈ నెల 3, 4న వర్ష తీవ్రత పెరిగే అవకాశముందని అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ లో రోడ్లన్నీ జలమయం అయిన నేపథ్యంలో బయటకు వచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మ్యాన్ హోల్స్  విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాలను ముట్టుకోకూడదన్నారు. పాత ఇండ్లు, కట్టడాలను దగ్గర ఉండే వాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు.

Read Also: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, రాష్ట్రంలో భారీ వర్షాలు

Back to top button