
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర రైతులకు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి అంటే… బీహార్ లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే తమ సొంత బీహార్ రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయారు. తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలనె ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడి పనులు అక్కడ ఆపివేసి ఓటు వేయడానికి వెళ్లిపోయారు. ఈ బీహార్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర రైతులకు కొన్ని సమస్యలను తెచ్చిపెట్టాయి. ఇక్కడ పని చేస్తున్నటువంటి బిహారీలు ఓటేసేందుకు సొంత రాష్ట్రానికి వెళుతుండగా రాష్ట్రంలో హమాలీల కొరత ఏర్పడి ధాన్యం కొనుగోళ్లు అక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం రైస్ మిల్లుల వద్ద లోడింగ్ మరియు అన్లోడింగ్ కావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 20000 మంది హమాలీలు ఉంటే అందులో 18,000 మంది బిహారిలే ఉండడం గమనార్హం. బీహార్ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒక్కొక్క వ్యక్తికి 5000 రూపాయలు చొప్పున ఇచ్చి ఇక్కడి నుంచి వాళ్ళ రాష్ట్రానికి ఓటు వేయించుకోవడానికి తీసుకు వెళుతున్నట్లుగా సమాచారం. ఈనెల 11వ తేదీన అక్కడ ఎన్నికలు ముగుస్తాయి కాబట్టి 12 లేదా 13వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 18,000 మంది హమాలీలు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read also : రైతులకు నష్టపరిహారం పెంచుతున్నాం : మంత్రి అచ్చన్న
Read also : తప్పంతా ఆ ఎమ్మెల్యే దే.. TDP క్రమశిక్షణ కమిటీ కీలక వ్యాఖ్యలు?





