
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా సోమవారం మీడియాతో సమావేశమైన ఓవైసీ.. వక్ఫు చట్టం గురించి వ్యాఖ్యానించారు. గతంలో వైసిపి పార్టీ ఈ చట్టాన్ని నిర్మొహమాటంగా వ్యతిరేకించిందని తేల్చి చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు పార్టీలు మాత్రం ఈ వక్సు చట్టానికి పూర్తిగా మద్దతు ఇచ్చాయని చెప్పారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ పార్టీలను తప్పక ఓడించి ఇద్దరికీ కూడా బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ రెండు పార్టీలను కూడా ఖచ్చితంగా ఓడించి తీరాలని ఓవైసీ పిలుపునిచ్చారు. అలాగే పార్లమెంట్లో కూడా అడ్డగోలుగా ఈ వక్ఫ్ చట్టం అమలు చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లింల హక్కులను చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కాలరాసే ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి వారి మోసపూరిత మాటలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. మాట్లాడితే చాలు పదేపదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి అని జపం చేస్తున్నారని… కానీ అమరావతి పనుల్లో మాత్రం ఎలాంటి వేగం ఎందుకు పెంచడం లేదని ఓవైసీ ప్రశ్నించారు. ఇలాంటి పార్టీ అధినేతలందరూ స్థానిక ఎన్నికల నుంచి ఓటమి రుచి చూపించాలని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కోరారు.