అంతర్జాతీయం

బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడి.. RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు!

క్రైమ్ మిర్రర్,అంతర్జాతీయ న్యూస్:-
ప్రస్తుతం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మన దేశంలోనే పలువురు వ్యక్తులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువులపై దాడులు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లోని హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని.. ఇక ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఉంటారో వారందరూ కూడా వారికి అండగా నిలవాలి అని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు ఒక భారతదేశమే ఏకైక ఆశ్రయమని.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఈ విషయాలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందే అని అన్నారు. ఇటువంటి పరిస్థితులు మనదేశంలో రాకుండా ఉండడానికి ప్రభుత్వం తరఫున మరిన్ని గట్టి చర్యలు తప్పకుండా అవసరం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ మధ్యకాలంలో హిందువులపై ఇతర దేశాలలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. మన భారతదేశంలో ప్రస్తుతానికి ఆ పరిస్థితులు లేకపోయినా భవిష్యత్తులో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని స్పష్టంగా కొన్ని పరిస్థితుల కారణంగానే అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి తరుణంలోనే కులాలనే తేడా లేకుండా ప్రతి ఒక్క హిందువు కూడా ఐక్యమత్యంతో కలిసి మెలిసి ఉండాలని సూచించారు. అయితే రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ లో ఒక హిందువును చెట్టుకు వేలాడదీసి సజీవంగా దహనం చేసిన వీడియోలు దేశవ్యాప్తంగా వైరుల్అయిన విషయం తెలిసిందే. ఇతర దేశాల్లో హిందువుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని స్పష్టంగా ఈ విషయంతో అర్థమవుతుంది.

Read also : ఎంట్రీ ఇవ్వగానే ఫైర్.. నిన్నటి వరకు ఒక లెక్క! ఈరోజు నుంచి మరో లెక్కంటూ కేసీఆర్ స్పీచ్

Read also : Gang Rape: మైనర్ బాలికపై మృగాళ్ల కిరాతకం.. ఆటోలో తీసుకెళ్లి పదే పదే అత్యాచారం!

Back to top button