అంతర్జాతీయం

అమెరికాలో తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం

  • సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్లు, సిబ్బంది సమయస్పూర్తి

  • లాస్‌ ఏంజిల్స్‌లో ఎదురెదురుగా వచ్చిన విమానాలు

  • ఒక్కసారిగా ఎత్తును తగ్గించిన సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది

  • ఒక్కసారిగా కుదుపునకు గురైన విమానం, పలువురికి గాయాలు

  • పెనుప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు

క్రైమ్‌మిర్రర్‌, నిఘా: అమెరికాలో తృటిలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. పైలట్లు, సిబ్బంది సమయ స్ఫూర్తితో వ్యవహరించడంతో సౌత్‌ వెస్ట్‌ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం తృటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడింది. లాస్‌ ఏంజిల్స్‌ నుంచి బయల్దేరిన సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఆకాశంలో ప్రయాణిస్తుండగా హ్యాకర్‌ హంటర్‌ చెందిన యుద్ధ విమానం ఎదురుగా వచ్చింది.

యుద్ధం విమానం రాకను ఆకస్మికంగా గమనించిన సౌత్‌వెస్ట్‌ విమానం పైలట్లు ఎత్తును ఆకస్మికంగా తగ్గించారు. ఎత్తును ఒక్కసారిగా తగ్గించడంతో విమానం కుదుపునకు గురైంది. దీంతో పలువురు ప్రయాణికులకు, విమాన సిబ్బందికి గాయాలయ్యాయి. కొందరికి గాయలు అయినప్పటికీ పెనుప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పెను ప్రమాదాన్ని తప్పించిన పైలట్లు, విమాన సిబ్బందిపై సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రశంసలు కురిపించింది. ప్రయాణికులు, ఉద్యోగుల భద్రతే తమకు ముఖ్యమని సౌత్‌వెస్ట్‌ పేర్కొంది.

Read Also: 

  1. హైదరాబాద్ లో కుండపోత, రహదారులు జలమయం
  2. తెలంగాణలో స్థానిక ఎన్నికల హడావుడి స్టార్ట్‌
Back to top button