అంతర్జాతీయం

భారత్ పై టారిఫ్ మరింత పెంచుతాం, ట్రంప్ సంచలన ప్రకటన!

Trump Again Threatens India: భారతీయ ఉత్పత్తులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన ట్రంప్..  మరోసారి భారత్ పై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. టారిఫ్ లు మరింత పెంచనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రష్యా నుంచి భారత్‌ ఆయిల్  కొనుగోళ్లు విపరీతంగా చేస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భారత్ నిర్ణయం రష్యాకు లాభాల పంట పండిస్తోందన్నారు. రష్యా లాభాలకు కారణమవుతున్న భారత్‌పై మళ్లీ టారిఫ్‌లను విధిస్తానని ట్రంప్‌ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ప్రకటించారు. భారత్‌పై 25 శాతం దిగుమతి సుంకాలు అమల్లోకి వచ్చిన 5 రోజుల తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

ట్రంప్ ఏమన్నారంటే?

‘‘రష్యా నుంచి భారత్‌ విపరీతంగా భారీ ఎత్తున ముడి చమురును కొనుగోలు చేస్తోంది. సొంత అవసరాల కోసం మాత్రమే కాదు ఇతర దేశాలకు తిరిగి రీసేల్‌ చేసేందుకూ రష్యా నుంచి ఆయిల్‌ను కొంటోంది. ఇలా కొన్న ఆయిల్‌ను అక్రమంగా ఓపెన్‌ మార్కెట్‌ పద్ధతిలో విదేశాలకు అమ్ముకుని లాభాలు గడిస్తోంది. భారత్‌ తన లాభాలను చూసుకుంటోంది. కానీ,   రష్యా ఏ స్థాయిలో లాభాల పంట పండిస్తోందో భారత్‌ పట్టించుకోవట్లేదు.  భారత్‌కు ముడి చమురును విక్రయించడం ద్వారా వచ్చిన నగదు ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్‌ యుద్ధం కోసం ఖర్చు పెడుతోంది. దీంతో రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌ లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా ఒక యుద్ధ యంత్రంలా మారిపోయింది. భారత్‌కు ఇవేం పట్టవు. అందుకే భారత్‌పై మళ్లీ దిగుమతి సుంకాలను పెంచుతా’’అని ట్రంప్‌ ట్రూత్ లో రాసుకొచ్చారు.

Read Also: ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్ల కొనుగోలుకు బ్రేక్.. భారత్ కీలక నిర్ణయం!

Back to top button