
T20 World Cup 2026: వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026పై క్రికెట్ ప్రపంచం దృష్టి సారించింది. భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు సందడిగా కొనసాగనుంది. ప్రతి ఎడిషన్‌లోలా ఈసారి కూడా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఒకే గ్రూప్‌లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరిగే హై వోల్టేజ్ పోరు ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుండటంతో అభిమానుల్లో ఇప్పటికే భారీ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. 2026 ప్రపంచకప్ కోసం భారత జట్టుకు కొత్త జెర్సీని బీసీసీఐ విడుదల చేసింది. పూర్తిగా కొత్త డిజైన్‌తో, భిన్నమైన స్టైల్‌లో రూపొందించిన ఈ జెర్సీని భారత కెప్టెన్ రోహిత్ శర్మ, యువ బ్యాటర్ తిలక్ వర్మలు కలిసి ఆవిష్కరించారు. బుధవారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా ఈ కొత్త టీ20 జట్టు జెర్సీని అధికారికంగా విడుదల చేశారు.
ఇప్పటి వరకు ఉన్న జెర్సీతో పోలిస్తే ఇది పూర్తిగా కొత్త లుకుతో రూపొందించబడింది. జెర్సీపై నిలువుగా లైన్స్ ఉండటం, ఆరెంజ్ కలర్‌ను మరింత స్పష్టంగా హైలైట్ చేయడం ఈ డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కొత్త జెర్సీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు కొత్త రూపులో టీమిండియాను చూడడానికి ఇష్టంగా ఎదురు చూస్తున్నారు.
అంతేకాక, టీమిండియా షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైంది. ఫిబ్రవరి 7న యూఎస్‌ఏతో ముంబైలో తొలి మ్యాచ్ ఆడనుంది. తరువాతి మ్యాచ్ ఫిబ్రవరి 12న నమీబియాతో ఢిల్లీలో జరగనుంది. అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న భారత్- పాకిస్థాన్ పోరు 15న కొలంబోలో జరుగుతుంది. అనంతరం ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్ తో ఆడనుంది. మొత్తానికి, టీ20 ప్రపంచకప్ 2026ను అత్యంత శక్తివంతంగా ఆడేందుకు టీమిండియా ముందుకు సాగుతోంది.
ALSO READ: CRIME: ఓర్నీ దుంపతెగ.. పిన్నీసుతో 11 బైక్‌లో చోరీ చేశాడు..!





