జాతీయంరాజకీయం

గెలిచేది విజయ్ అంటున్న సర్వే!.. రికార్డు సృష్టిస్తాడా?

క్రైమ్ మిర్రర్, న్యూస్ :- తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో సంచలన విషయం బయటపడింది. హీరో నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు విజయ్ రాబోయే ఎన్నికలలో గెలుస్తాడని ఒక సోషల్ మీడియా సర్వే అంచనా వేసింది. హీరోగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు విజయ్… తమిళగ వెట్రి కలగం( టీవీకే ) పార్టీని స్థాపించి ప్రజలలో మంచి పేరును సంపాదించుకోబోతున్నారు. అయితే గత ఎన్నికలకు ముందే తమిళనాడులో పార్టీ స్థాపించిన విజయ్ రాబోయే ఎలక్షన్లలో పోటీ చేయబోతున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని రాజకీయంలో అనుభవాలు పొందుతూ ఉన్నారు.

అయితే తాజాగా ఒక సోషల్ మీడియా సర్వే అందించిన వివరాల ప్రకారం… విజయ్ పార్టీ 2026 లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో దాదాపుగా 100కు పైగా స్థానాలను సంపాదించి విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతేకాకుండా 34.5% ఓట్లను పొందవచ్చు అని తెలిపింది. ఇక మరోవైపు డీఎంకే పార్టీ కూటమికి 75 నుంచి 85 స్థానాలు, 30% ఓట్లు రావచ్చు అని తెలిపింది. అలాగే అన్నా డిఎంకె కి 55 నుంచి 65 సీట్లు ( 28% ఓట్లు ) రావచ్చని అంచనా వేసింది. దీంతో ఈ సర్వే ఫలితాలు అనేవి హీరో విజయ్ పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపుతుంది. దీంతో విజయ్ పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న విజయ్… సోషల్ మీడియా వేదికగాను పార్టీకి మరింత బలం పెరగాలని ఆలోచిస్తున్నారు.

అయితే సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ సర్వే ఫలితాలను ఎంతవరకు నిజమని చెప్పాలి అనేది చెప్పలేము. కానీ ఏది ఏమైనా కూడా ఇవి విజయ్ పార్టీకి చాలా బలం అనే చెప్పాలి. భవిష్యత్తులో… తమిళనాడు రాజకీయాలనేవి మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతూనే ఉంది. దాదాపు మూడు నెలల పాటు అన్ని వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాల్ని ఈ సర్వే వెల్లడించిందని తెలిపారు. మరి రాబోయే ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందో మీరు కామెంట్ చేయండి.

అవన్నీ నమ్మకండి.. ఏ చార్జీలు పెంచలేదు.. విద్యుత్ చార్జీలపై స్పందించిన గొట్టిపాటి!..

అవన్నీ నమ్మకండి.. ఏ చార్జీలు పెంచలేదు.. విద్యుత్ చార్జీలపై స్పందించిన గొట్టిపాటి!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button