Tuesday, March 3, 2026
Homeతెలంగాణమంత్రివర్యులకు కృతజ్ఞతలు అంటున్న సూరారం గ్రామస్తులు

మంత్రివర్యులకు కృతజ్ఞతలు అంటున్న సూరారం గ్రామస్తులు

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు కొంతమంది సొంత వాహనాల్లో వస్తుండగా చాలా మంది మాత్రం ఆర్టీసీ బస్సును ఆశ్రయిస్తున్నారు. మరి కొంతమంది ఏ వాహనం లేక పుష్కర పుణ్యం వరించక ఇంట్లోనే ఉంటున్నారు అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి కాలేశ్వరం వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఇదే క్రమంలో సూరారం గ్రామంలో ఉచిత బస్ సర్వీస్ ను ప్రారంభించిచడం జరిగింది, ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా ప్రజలను నిర్లక్ష్యం చేయకుండా అందరికీ దైవానుగ్రహం కలగాలని సదుద్దేశంతో శ్రీధర్ బాబు చేసిన ఉచిత బస్ సౌకర్యానికి నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అందరి తరపున శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల రమేష్ రెడ్డి, సీనియర్ నాయకులు మడక ప్రతాపరెడ్డి, తులసి మహేష్, చల్ల చిన్నన్న, ములకల్ల సాంబశివారెడ్డి, చల్ల మహేష్, రాజేశం, తిరుపతిరెడ్డి,రాజబాపు, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు యువజన నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

మంచు బ్రదర్స్ కాంపిటిషన్: ‘కన్నప్ప’ వర్సెస్ ‘భైరవం’ – అభిమానులు ఎవరి వైపు?

జ్యోతికి పాకిస్తాన్‌లో రాజభోగాలు – ఏకే-47లతో ఏడుగురు గన్‌మెన్లు కాపలాగా!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments