
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- కోవిడ్ సమయంలో ఇచ్చిన టీకాలకు ఈ మధ్యకాలంలో ఎంతోమంది పిల్లలు మరియు యువత ఆకస్మిక మరణాలు చెందుతున్నారు అని చాలానే వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వీటిపై స్పందించిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు మరియు యువతలో ఆకస్మిక మరణాలు పెరగడానికి కోవిడ్ టీకాలే కారణమని వస్తున్నటువంటి వార్తలు, వాదనలు అన్నీ కూడా అవాస్తవమని కొట్టి పారేశారు. ఈ ఏడాదిలో ఇలా ఎంతోమంది ఆకస్మిక మరణాలు చెందినటువంటి వ్యక్తుల మృతదేహాలను పరిశీలించి, ఎన్నో పరీక్షలు జరిపి ఈ విషయాన్ని వెల్లడిస్తున్నామని ప్రకటించారు.
Read also : పేరు మహిళలదే కానీ పెత్తనం మాత్రం పురుషులదే..?
దాదాపు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు మరణించిన వ్యక్తులనే పరీక్షించాము అని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ 45 ఏళ్ల లోపు చనిపోయిన వారిలో 42.6% వరకు గుండె జబ్బులే కారణమని కీలక ప్రకటన చేశారు. ఇక 21.3% మంది మాత్రమే శ్వాసకోశ సమస్యలతో చనిపోయారు అని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తేల్చి చెప్పారు. ఇక స్త్రీలతో పోలిస్తే ఈ ఆకస్మిక మరణాలలో ఐదు రెట్లు ఎక్కువగా పురుషులే ఉన్నారు అని తెలిపారు. కాబట్టి కోవిడ్ టీకాకు ఇటువంటి ఆకస్మిక మరణాలకు ఎక్కడా కూడా సంబంధం లేదు అని.. దయచేసి ఆ వాస్తవ ప్రకటనలు ఎవరూ కూడా సృష్టించవద్దు అని స్పష్టం చేశారు. ఇన్నాళ్లుగా ప్రతిరోజు యువతలో ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకానే కారణమని ఎంతోమంది వాదనలు, వార్తలు సృష్టించారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేడు ఢిల్లీ వైద్యులు చనిపోయిన యువతను పరీక్షించి గుండె సమస్యల కారణంగానే ఎక్కువమంది చనిపోయారు అని తేల్చి చెప్పారు.
Read also : గిల్ పూర్తిగా విఫలం.. జైస్వాల్ రావాల్సిందే..?





