Tuesday, March 17, 2026
Homeతెలంగాణవిద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించాలి...! క‌లెక్ట‌ర్ కుమార్ దీప‌క్‌

విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించాలి…! క‌లెక్ట‌ర్ కుమార్ దీప‌క్‌

మంచిర్యాల, క్రైమ్ మిర్ర‌ర్ : ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో గల ఆదర్శ పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఆహారం నాణ్యత, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు. బాలికల వసతి గృహంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం హాజీపూర్ మండలం గుడిపేట లోని చందనాపూర్ లో గల పట్టణ ఆవాస పాఠశాలను సందర్శించి పాఠశాలలో చేపట్టిన అదనపు గదులు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

వంటశాలను సందర్శించి విద్యార్థుల ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, ఆహారం తయారీ సమయంలో సిబ్బంది శుభ్రత నిబంధనలు పాటించాలని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని, ఈ నేపథ్యంలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments