తెలంగాణ

విద్యార్దులు శారీరకంగా దృఢంగా ఉండాలి : లయన్స్ క్లబ్ ఎలైట్ గవర్నర్

-200 మంది విద్యార్థులకు షూస్ బెల్ట్ టై ఐడి కార్డులు పంపిణీ

-లయన్స్ క్లబ్ ఎలైట్ సేవలు మరువలేనివి

-20 వేల రూపాయలు అందజేసిన గవర్నర్
మునుగోడు,క్రైమ్ మిర్రర్ : విద్యార్దులు ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని నల్లగొండ లయన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్ గవర్నర్ మదన్మోహన్ రేపాల అన్నారు.మునుగోడు మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 200 మంది విద్యార్ధిని విద్యార్దులకు సుమారు 1లక్ష రూపాయల వ్యయంతో నల్లగొండ లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యములో షూస్, బెల్ట్, టై, ఐడి కార్డులు పంపిణీ చేశారు..ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లయన్ సుంకరి భిక్షం గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమములో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఎలైట్ జిల్లా గవర్నర్ పిఎంజెఎఫ్ లయన్ మధన్ మోహన్ రేపాల,మండల విద్యాధికారి తలమల్ల మల్లేశం,పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి విద్యార్దులకు షూస్, బెల్ట్, టై, ఐడి కార్డులు అందజేశారు…లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఎలైట్ గవర్నర్ మధన్ మోహన్ రేపాల మాట్లాడుతూ….లయన్స్ క్లబ్ ఎలైట్ 200 దేశాల్లో పనిచేస్తుందని, విద్యార్దులు శారీరకంగా దృఢంగా ఉండాలన్నారు.టీచర్లు తల్లిదండ్రులు చెప్పింది విని విద్యార్దులు మంచి స్థాయికి ఎదగాలని , ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని సూచించారు..ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు లయన్స్ క్లబ్ లు చేయూత నిస్తామన్నారు.

ప్రధానోపాధ్యాయులు సుంకరి భిక్షం గౌడ్ వేల మంది ఉపాధ్యాయులకు సేవ చేసిన నాయకుడు అని, 200 మంది విద్యార్ధులను చేర్పించి ఆదర్శప్రాయుడిగా నిలిచారన్నారు.క్లబ్ సభ్యుడు బోనగిరి సురేందర్ తమ తల్లి జన్మదినం సందర్భంగా ఆగస్టు 15 న పాఠశాల విద్యార్ధులకు స్వీట్లు,పండ్లు పంపిణీ చేయనున్నారు.ఎర్ర్బోతు యాదగిరి రెడ్డి తమ తల్లితండ్రుల పేరు మీద సహాయము అందజేస్తామని హామీ ఇచ్చారు…మండల విద్యాధికారి తలమల్ల మల్లేశం మాట్లాడుతూ మునుగోడు ప్రాథమిక పాఠశాల జిల్లాకు ఒక ఐకాన్ గా మారిందని,టీచర్లు నా భూతో నా భవిష్యత్ అన్నచందంగా ఉన్నారని కొనియాడారు..లయన్స్ క్లబ్ ప్రభుత్వ పాఠశాలలకు చేస్తున్న సేవలు మరువలేనువన్నారు. పాఠశాలల అభివృద్ధికి పాటుపడటం అభినందనీయం అన్నారు..పాఠశాల తరుపున లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఎలైట్ సభ్యులను,అతిధులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.బాతరాజు అంజయ్య,పాల్వాయి హరిప్రసాద్,ఇంద్రకంటి ఇంద్రారెడ్డి, ఉప్పల రవి కుమార్,అద్దంకి సునిల్, పిఆర్టియు మునుగోడు మండల అధ్యక్ష కార్యదర్శులు యూసుఫ్ పాషా, మేకల అన్నపురెడ్డి,రాష్ట్ర నాయకులు వెంకన్న గౌడ్,కళావతి,ఎలైట్ సభ్యులు మల్వాల మల్లయ్య, గోవింద్ రెడ్డి, బోయపల్లి వెంకటేశ్వర్లు,శ్రీనివాస్ రెడ్డి,రాంరెడ్డి,రాంబాబు,,పాఠశాల ఉపాధ్యాయులు,తల్లితండ్రులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button