
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు కొన్ని ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూల్స్ పై తీవ్రంగా మండిపడుతున్నాయి. పలు కార్పోరేట్ మరియు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం వాళ్లకి నచ్చినట్లుగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రతి నెల రెండవ శనివారం స్కూల్లోకి సెలవు ఇవ్వకుండా ఒకవైపు టీచర్లను మరో వైపు విద్యార్థులను తీవ్రవృత్తిడికి గురి చేస్తున్నట్లుగా ఆరోపించాయి. విద్యార్థుల సంఘాలు ప్రతిరోజు కూడా వీటిపై హెచ్చరిస్తున్న ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని తెలిపారు. ప్రతి నెల రెండవ శనివారం టీచర్లకు అలాగే విద్యార్థులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆరోజు స్కూల్లకు సెలవు ఇవ్వాలని SFI మరియు DYFI నేతలు విద్యాశాఖ డైరెక్టర్ అయినటువంటి నవీన్ నికోలస్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా రెండవ శనివారం సెలవు ఇవ్వకుండా క్లాసులు నిర్వహిస్తున్నటువంటి స్కూల్స్ మరియు స్కూళ్ల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల సంఘాలు డిమాండ్ చేశారు.
కాగా ఈమధ్య తెలంగాణ రాష్ట్రంలో కొన్ని స్కూళ్లు రెండవ శనివారం కూడా విద్యార్థులను స్కూల్స్కు పిలిపించుకొని క్లాసులు చెప్పడం వైరల్ గా మారిపోయాయి. దీంతో ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసి ప్రతి ఒక్కరు కూడా… ఎవరికి వారికి నచ్చినట్లుగా స్కూల్స్ నడుచుకుంటున్నాయని చెప్పేసి ఇలా వార్తలు రావడం జరిగాయి. దీంతో నేడు విద్యార్థుల సంఘాలు ఈ విషయంపై తీవ్రంగా మండిపడ్డాయి. భవిష్యత్తులో చక్కగా చదువుకొని ఎదిగి… మంచి జాబ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాల్సిన విద్యార్థులపై ఇలా ఒత్తిడి తీసుకురావడం వల్లే ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.