
కోదాడ, క్రైమ్ మిర్రర్ :- ఆర్ఎంపి వైద్యం వికటించి విద్యార్థిని మృతి చెందిన ఘటన చిలుకూరు మండల పరిధిలోని బేతవోలు గ్రామంలో చోటుచేసుకుంది. బడే సాహెబ్, బంధుమిత్రులు తెలిపిన వివరాల ప్రకారం… నడిగూడెం కస్తూర్బా స్కూల్లో సుహాన (13) అనే బాలిక 8వ తరగతి చదువుతుంది. స్కూల్లో ఉండగా మూడు రోజుల నుంచి జ్వరం వస్తుందని ఇంటికి వచ్చింది. గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్ ను ఆశ్రయించగా జ్వరానికి సంబంధించిన టెస్టులు చేపించుకొని రమ్మని తెలిపారు. టెస్టులన్నీ ఆర్ఎంపి డాక్టర్ కు చూపించగా ఎక్కువ మోతాదులో ఇంజక్షన్ ఇవ్వడంతో అక్కడికక్కడే ఫిట్స్ వచ్చి మృతి చెందిందని మేనమామ బడే సాహెబ్ అన్నారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
Read also : నో షేక్ హాండ్స్.. నో హగ్స్.. టీమిండియాను మెచ్చుకుంటున్న అభిమానులు!
Read also : విలన్ పాత్రకు మంచు మనోజ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Read also : నో షేక్ హాండ్స్.. నో హగ్స్.. టీమిండియాను మెచ్చుకుంటున్న అభిమానులు!