తెలంగాణ

అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రులు నడిపితే కఠిన చర్యలు తప్పవు

క్రైమ్ మిర్రర్,శంకర్ పల్లి :- అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రులు నడిపితే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగేంద్రబాబు అన్నారు. శుక్రవారం శంకర్‌పల్లి పట్టణ కేంద్రంలో గల ప్రైవేటు ఆసుపత్రులను జిల్లా వైద్యాధికారి సూచనల మేరకు చేవెళ్ల డివిజన్ లోని శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో గల ప్రైవేటు ఆసుపత్రులను డిప్యూటీ డిఎంహెచ్వో తనిఖీ చేశారు. ఆసుపత్రులలోని పలు రికార్డులను, బోర్డులను పరిశీలించారు. ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు, అనుమతి లేని స్కానింగ్ లు చేయకూడదని హెచ్చరించారు. ఆర్ఎంపిలు ప్రథమ చికిత్స తప్ప ఇంజక్షన్లు కూడా ఇవ్వకూడదని సూచించారు. పిసిపిఎన్ డిటి యాక్ట్ కింద అన్ని ఆసుపత్రుల వారు స్కానింగ్ సెంటర్లు రూల్స్ పాటించాలని అన్నిచోట్ల పిసిపి ఎన్ డిటి బోర్డు తప్పనిసరిగా ఉంచాలని తెలియజేశారు. ఆసుపత్రుల యొక్క నివేదికను తయారుచేసి జిల్లా కార్యాలయానికి పంపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డా. అనూష, డా. శోభారాణి, డా. శ్రీనివాస్, మన్సూర్, సుదర్శన్ రెడ్డి, అనూష పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

1.ఎమ్మెల్యే కు ఆహ్వాన పత్రిక అందించిన కోటంచ జాతర కమిటీ

2.టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట బోర్డు – తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

3.మొబైల్ వాడొద్దని చెప్పిన తల్లి… దారుణంగా చంపిన కొడుకు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button