
-
తమ బర్రెల షెడ్లను అక్రమంగా కూల్చారని ఆరోపణ
-
భూపాలపల్లి నియోజకవర్గంలో హాట్ టాపిక్
-
పాడి రైతులు కూరాకుల ఓదెలు, లలిత ధర్నా
క్రైమ్‌మిర్రర్, వరంగల్: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకు వింత నిరసన ఎదురైంది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోకి గేదెలను తోలి ఆందోళన చేశారు పాడి రైతులు. తమ గేదెల షెడ్డును అక్రమంగా కూల్చారని ఆరోపించారు.
వివరాల్లోకి వెళ్తే… జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం వేషాలపల్లిలో గేదెలను పోషిస్తూ జీవనం సాగిస్తున్నారు పాడి రైతు దంపతులు కూరాకుల ఓదెలు, లలిత. ఓ షెడ్డు నిర్మించుకొని గేదెలను పోషిస్తున్నారు. అయితే ఆ షెడ్డును అధికారులు కూల్చేశారు. ఎమ్మెల్యే గండ్ర చెబితేనే అధికారులు కూల్చేశారని పోలీసులు చెబుతున్నారని ఆ దంపతులు నిరసనకు దిగారు. తమ బర్రెలను ఎక్కడ కట్టేసుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తూ ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి తీసుకొచ్చారు. తాము ఒక్క రూపాయి తీసుకోకుండా గండ్రకు ఓటేశామని, దానికి బదులుగా ఇప్పుడు మా జీవినాధారాన్ని దెబ్బతీసి బహుమతి ఇస్తున్నారంటూ వాపోయారు. తమ షెడ్డును తిరిగి నిర్మించే వరకు గేదెలను తీసుకెళ్లే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు.
Read Also: