తెలంగాణ

ఆదిలాబాద్‌ జిల్లాలో పోలీసులపై రాళ్లదాడి… పోడు భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం

  • పోలీసులపై తిరగబడ్డ కేశవపట్నం గ్రామస్థులు

  • పోడు భూముల్లో మొక్కలు నాటుతున్న పోలీసులు

  • పోడు భూముల జోలికి రావొద్దని స్థానికుల హెచ్చరిక

  • పోలీసులు నాటిన మొక్కల తొలగింపు

  • భూముల స్వాధీనానికి వచ్చిన పోలీసులపై రాళ్లదాడి

క్రైమ్‌మిర్రర్‌, నిఘా: ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అటవీ అధికారులు, పోలీసులపై స్థానికులు రాళ్లదాడి చేశారు. ఈ రాళ్లదాడిలో పలువురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ఇచ్చోడ మండలం కేశవపట్నంలో స్థానికులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అటవీశాఖ భూముల్లో కార్యకలాపాలు చేయొద్దంటూ కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో పోడు వ్యవసాయ పొలాల్లో కొంతకాలంగా పోలీసులు చెట్లను నాటుతున్నారు. ఆ భూమిని ఖాళీ చేయాలని స్థానికులు ఆదేశాలిచ్చారు. ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని, ఆ భూములు లాక్కోవాలని చూస్తే సహించేది లేదని స్థానికులు హెచ్చరించారు. పోలీసులు నాటిన మొక్కలను తొలగించారు. భూముల్లో అడుగుపెడితే ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరించారు. ఈ క్రమంలో పోలీసులతో కలిసి అటవీశాఖ అధికారులు భూముల స్వాధీనానికి వచ్చారు. ఆగ్రహానికి గురైన స్థానికులు వారిపై రాళ్లతో దాడి చేశారు. ఒక్కసారిగా దాడి చేయడంతో పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Read Also:

  1. తూప్రాన్‌లో బోనాల పండగ పూట విషాదం… వీధి కుక్కల స్వైరవిహారం, 25మందికి గాయాలు
  2. ఆపరేషన్‌ సిందూర్‌తో సత్తా చాటాం… యాక్సియం-4 మిషన్‌పై మోదీ ప్రశంసలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button