
హైదరాబాద్(క్రైమ్ మిర్రర్):-మేడ్చల్ జిల్లా, బోడుప్పల్ కు ప్రాంతానికి చెందిన పీనా నాయక్ కు గత 30 ఏళ్ల కితమే వివాహం జరిగింది.. ఆయనకు కూతురు, కుమారుడు జన్మించారు.. తాను కొన్ని విషయాలలో భార్య నుండి 2003లో విడాకులు తీసుకోగా, అప్పటి నుండి కూతురు మహేశ్వరి తండ్రి దగ్గరే ఉంటుంది.. 2003 లోనే పీనా నాయక్, లలిత అనే ఒక మహిళను రెండో వివాహన్ని చేసుకున్నాడు… ఈమెకు ఒక కూతురు ఉన్నది.. కూతురు మహేశ్వరి బీఎస్సీ నర్సింగ్ చేసి, ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది.. ఆ సమయంలో పరిచయం అయిన ఒక యువకుడిని మహేశ్వరి పెళ్లి చేసుకుంది.. కొంతకాలానికి విబేదాలతో వీరిద్దరూ కూడా విడాకులు తీసుకున్నారు.. ఆ తర్వాత కూతురు మహేశ్వరి రెండో వివాహం కోసం, తండ్రి కూతురికి డబ్బు ఇవ్వాలని అనుకున్నాడు.. ఇందుకోసం బోడుప్పల్ లో తనకున్న రెండు ఇండ్లలో ఒకటి మహేశ్వరికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు.. దీంతో ఆస్తి పోతుందని భావించిన సవతి తల్లి లలిత, తన మరిది అయిన సీఆర్పీఎఫ్ జవాన్ బానోత్ రవి, అతడి స్నేహితుడు వీరన్నలతో కలిసి మహేశ్వరిని చంపాలని పథకంపన్నారు.. 2024 డిసెంబర్ 7న ఉద్యోగ పనులపై, పీనా నాయక్ బయటికి వెళ్లిన సమయాన్ని చూసి, ఈ ముగ్గురు మహేశ్వరిని చంపి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వంగమర్తి మూసి నదిలో పూడ్చి పెట్టారు.. పీనా నాయక్ తిరిగి ఇంటికి రాగానే కూతురు వేరే అతనితో వెళ్లిపోయిందని తండ్రికి చెప్పారు.. ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని భార్య లలిత అతనిని నమ్మించింది.. దీంతో మౌనంగా ఉన్న పీనా నాయక్ 4 నెలలవుతున్నా కూతురు జాడ తెలియకపోవడంతో, అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బండారం బయట పడింది.. ఇక రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగారు.. విచారణలో మహేశ్వరిని ఆస్తి కోసమే చంపినట్లు వారు అంగీకరించగా, ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.. రోజు రోజుకు మానవత్వం మంట కలిసి పోతుందని, బంధాలకు విలువే లేకుండా పోతుందని ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది.