తెలంగాణ

రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన చండూరు సన్ షైన్ పాఠశాల విద్యార్థులు..

చండూరు, క్రైమ్ మిర్రర్:-
నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన షోటో ఖాన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి వారియర్ కప్ ఆఫ్ ఛాంపియన్ షిప్ పోటీలలో స్థానిక సన్ షైన్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఫిదియాన్, సౌధ్, మాల్విక్ అత్యుత్తమ ప్రదేశాలను కనబరచి రాష్ట్రస్థాయిలో ఫిథియాన్ రెండవ బహుమతి, సౌధ్ మరియు మాల్విక్ సంయుక్తంగా మూడో బహుమతిని గెలుపొందారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న వారిని అభినందిస్తూ సన్ షైన్ విద్యార్థులు చదువులతో పాటు ఆటలలో కూడా అగ్రస్థానంలో రాణిస్తారు అనడానికి నిన్న జరిగిన కరాటే పోటీ నిదర్శనమని అన్నారు.

రాష్ట్రంలో ఖజానా ఖాళీ అంటున్న ముఖ్యమంత్రులు!… క్రైమ్ మిర్రర్ ప్రత్యేక కథనం… ప్రజల కోసం?

అదేవిధంగా కరాటే ఆత్మరక్షణలో భాగం మాత్రమే కాదంటూ మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తూ భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించడానికి సహాయపడుతుందని అన్నారు. ఈ కరాటే పోటీలో తెలంగాణ రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నప్పటికీ క్రమశిక్షణ, చురుకుతనం మరియు క్రీడా స్ఫూర్తిని ఉన్నత స్థాయిలో ప్రదర్శించిన సన్ షైన్ విద్యార్థులను బహుమతులు వరించాయని, అదేవిధంగా ప్రతి ఒక్కరు క్రమశిక్షణ కలిగి ఉండడం ద్వారా ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా మాస్టర్ రవిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ గారు, ప్రిన్సిపల్ రవికాంత్, ప్రవీణ్, లతీఫ్ పాషా మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఎన్నికల ఎఫెక్ట్… పలు జిల్లాలలో వైన్ షాపులు బంద్!.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button