జాతీయం

తల్లి కావాలని ఉంది.. కానీ చాలా భయం అంటున్న స్టార్ హీరోయిన్!

క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- ఒక టాలీవుడ్ లోనే కాకుండా అన్ని సినిమా ఇండస్ట్రీలలో నటించిన కమలహాసన్ కూతురు శృతిహాసన్ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. పెళ్లంటే చాలా భయంగా ఉందని శృతిహాసన్ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు పెళ్లి అంటే భయమని… అందుకే ఇప్పట్లో వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లుగా శృతిహాసన్ చెప్పుకొచ్చారు. ఒకవైపు తల్లి అవ్వాలని చాలా ఆశగా ఉందని.. కానీ పెళ్లి పట్ల చాలా భయంగా ఉందని చెప్పుకొచ్చారు. పెళ్లంటే భయమే కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు తల్లి అవుతానని అన్నారు. ఈ కాలంలో చాలా మంది యువతులు పెళ్లి చేసుకుని తమ యొక్క స్వేచ్ఛను కోల్పోతున్నారని శృతిహాసన్ ఆవేదన చెందారు. కానీ ఇలా ఒక వ్యక్తి స్వేచ్ఛను కోల్పోవడం అనేది నాకు అసలు నచ్చదు అని చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తిని ప్రేమించి ఆ ప్రేమలో బ్రతకడం అనేది చాలా బాగా ఉంటుందని… నేను అదే ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చాలా హ్యాపీగా, సింగల్ గా జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానని ఇంటర్వ్యూ ద్వారా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తెలిపారు.

కాగా ఈమధ్య తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటులు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే అదే దృష్టిలో ఉంచుకొని శృతిహాసన్ ఇవ్వాలా ఈ మాటలు అన్నారని అనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా భారత దేశవ్యాప్తంగా అన్ని సినిమా రంగాలలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. కొంతమంది పెళ్లి చేసుకోవడానికి భయమెందుకు అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుంటే… మరి కొంతమంది పెళ్లికి, భయానికి సంబంధం ఏంటి… దేశవ్యాప్తంగా ఎంతో మంది పెళ్లి చేసుకుని జీవనాలను సాగిస్తున్నారు కదా అని… కేవలం కొంతమందిని ఆదర్శంగా తీసుకుని ఇలా భయపడడం సరికాదని సలహాలు ఇస్తున్నారు.

ప్రైవేటు సంస్థకు గ్రామ పంచాయతీ స్థలాలు! రేవంత్ సర్కార్ మరో బాంబ్

డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ వట్టే జానయ్యకు సిట్‌ నోటీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button